twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గబ్బర్ సింగ్ -2, దేవిశ్రీకి మరో బంపర్ ఆఫర్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌కు మరోసారి బంపర్ ఆఫర్ చేజిక్కించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందబోయే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి సంగీతం అందించే చాన్స్ దక్కించుకున్నాడు. పవన్ కళ్యాణ్‌తో తొలిసారిగా 'జల్సా' సినిమాకు పని చేసిన దేవిశ్రీ ఆ సినిమాకు మాంచి మాస్ బీట్లు ఇచ్చి అందరినీ మెప్పించాడు.

    జల్సా ఆడియో మంచి హిట్ కావడంతో 'గబ్బర్ సింగ్' చిత్రానికి దరువేసే చాన్స్ కొట్టేసి.....తనకు ఇచ్చిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్నాడు. ఆ తర్వాత 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంగీతం అవకాశం దక్కించుకుని హాట్రిక్ కొట్టాడు. ఇంకా ఈ సినిమా ఆడియో విడుదల కాకముందే 'గబ్బర్ సింగ్-2' చిత్రానికి కూడా ఎంపికవడం విశేషం. పవన్ అభిమానులు మెచ్చే విధంగా ట్యూన్స్ ఇస్తాడనే నమ్మకంతోనే....మరోసారి దేవిశ్రీకి అవకాశం దక్కినట్లు స్పష్టం అవుతోంది.

    గబ్బర్ సింగ్-2 చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. 'గబ్బర్ సింగ్-2' చిత్రం సరికొత్త కథతో చేస్తున్నామని చెప్పిన సంపత్......ఈ సినిమా గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రీక్వెల్ గానీ, సీక్వెల్ గానీ కాదని స్పష్టం చేసాడు. జేమ్స్ బాండ్ సిరీస్ సినిమాలు దేనికది ఎలా ప్రత్యేకమో, గబ్బర్ సింగ్-2 చిత్రం కూడా ప్రత్యేకమైన కథతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే..... సంపత్ నంది మదిలో 'బెంగాల్ టైగర్' అనే టైటిల్ ఆలోచన ఉందట. అవకాశం వస్తే 'గబ్బర్ సింగ్-2' టైటిల్ 'బెంగాల్ టైగర్'గా మారుస్తానని అంటున్నాడు. అయితే ఈ విషయాన్ని తాను ఇప్పుడే ఖరారు చేయలేనని స్పష్టం చేస్తున్నాడు సంపత్. 'ఖుషి' చిత్రంలో పవన్ చెప్పిన 'ఐయామ్ రాయల్ బెంగాల్ టైగర్...సిద్ధూ సిద్ధార్థ రాయ్' అనే డైలాగ్ అప్పట్లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

    English summary
    Tollywood young music director Devi Sri Prasad will compose tunes for Pawan Kalyan's forthcoming action entertainer Gabbar Singh 2.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X