సమంత చేయి పట్టుకుని, రెచ్చిపోయిన దేవిశ్రీ (ఫోటోలు)
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఆడియో వేడుకల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ను మించిన వారు లేరనే చెప్పాలి. ఓ వైపు పాటలు పాడుతూ...డాన్స్ చేస్తూ రాక్ స్టార్ మాదిరిగా స్టేజిపై అదరగొడుతుంటాడు. తాజాగా 'అల్లుడు శ్రీను' ఆడియో వేడుకలోనూ దేవిశ్రీ అదరగొట్టాడు.
తాను పెర్పార్మెన్స్ ఇవ్వడంతో పాటు....హీరోలను, హీరోయిన్లను సైతం ముగ్గులోకి లాగి వారితో స్టెప్పులేయించడం, అభిమానులతో విజిల్స్ వేయించడం దేవిశ్రీ ప్రసాద్ స్టైల్. తాజాగా అల్లుడు శ్రీను వేడుకలోనూ తన జోష్ కొనసాగించాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ చిత్ర హీరో హీరోయిన్లయిన సాయి శ్రీనివాస్, సమంతలను స్టేజీపైకి లాగాడు. వారితో స్టెప్పులేయించడంతో పాటు....తాను వారితో కలిసి స్టెప్పులేసాడు.
ఒక రకంగా చెప్పాలంటే కొంత సేపటి వరకు స్టేజీని తన ఆధీనంలోకి తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ తన పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయాడని చెప్పొచ్చు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

సమంత చేయి పట్టుకుని...
సమంత చేయి పట్టుకుని ఆమెను స్టేజీపైకి తీసుకొస్తున్న దేవిశ్రీ ప్రసాద్...

మర్యాద మర్యాద...
సమంత స్టేజీ పైకి రాగానే....దేవిశ్రీ ప్రసాద్ ఆమెకు మర్యాద పూర్వకంగా నమస్కారం పెట్టడంతో ఆమె కూడా ప్రతినమస్కారం పెట్టారు.

సమంత మొహమాటం
దేవిశ్రీ ప్రసాద్ డాన్స్ చేయమని కోరగా ముందు సమంత మొహమాట పడింది. కానీ దేవిశ్రీ ఊరుకుంటాడా...డాన్స్ చేయాల్సిందే అంటూ పట్టుబట్టాడు.

మొత్తానికి స్టెప్పులేయించాడు..
మొత్తానికి సమంతతో దేశిశ్రీ ప్రసాద్ స్టెప్పులేయించాడు. ఎలా చేయాలో కూడా తానే స్వయంగా సూచనలు ఇచ్చాడు.

రెచ్చిపోయిన దేవిశ్రీ ప్రసాద్
దేవిశ్రీ ప్రసాద్ స్టేజీపై రెచ్చిపోయి తన తడాఖా చూపించాడు. ఇలా దుమ్ము రేపాడు.

సంతోష్ శ్రీనివాస్
దేవిశ్రీ ప్రసాద్ ఫోర్స్ చేయడంతో హీరో సంతోష్ శ్రీనివాస్ కూడా స్టేజీపైకి వచ్చాడు. అదరిపోయే స్టెప్పులేసాడు.

గీతా మాధురి
హాట్ సింగర్ గీతా మాధురి కూడా స్టేజీపై అదరగొట్టింది.

అదరిపోయింది
ఇతర సింగర్లు, డాన్సర్లు స్టేజీపై సందడి చేస్తుంటే....గీతా మాధురి కూడా వారితో కలిసింది.


Click it and Unblock the Notifications











