దేవి శ్రీ ప్రసాద్ తో వివి. వినాయక్ మూడోసారి.. ఈసారి హీరో ఎవరో తెలుసా?
తెలుగు తెరపై మరో భారీ కాంబినేషన్ రూపుదిద్దుకుంటోంది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ, టాప్ డైరెక్టర్లలో ఒకరైన వివి వినాయక్ మరోసారి కలిసి పనిచేయ్యబోతున్నారు. గతంలో వీరిద్దరూ చెన్నకేశవ రెడ్డి సినిమాకు పనిచెయ్యడం జరిగింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీరు మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారు. బాలకృష్ణ-వివి వినాయక్ కాంబినేషన్లో రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సికె ఎంటర్టెన్మెంట్ష్ బేనర్లో నిర్మించబోతున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నాడు. గతంలో వినాయక్, దేవి కలిసి అదుర్స్, అల్లుడు శ్రీను సినిమాలకు పనిచెయ్యడం జరిగింది. మూడోసారి వీరిద్దరూ వర్క్ చేయ్యబోతుండడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే 27న సినిమాను ప్రారంభించబోతున్నారు.

నిర్మాత సి.కళ్యాణ్ ఈ ఏడాది బాలకృష్ణతో 'జై సింహా', వినాయక్‌తో 'ఇంటిలిజెంట్' చిత్రాలను నిర్మించడం జరిగింది. రీమేక్ స్టోరీస్‌తో మరో సీనియర్ హీరో చిరంజీవికి 'ఠాగూర్', 'ఖైదీ నంబర్ 150' వంటి హిట్ చిత్రాలను అందించిన వినాయక్.. ఇప్పుడు బాలకృష్ణకు కూడా ఒక రీమేక్ సినిమా చేయ్యబోతున్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











