మళ్ళీ జల్సా చేయనున్నపవన్ కళ్యాణ్...!?
పవన్ కళ్యాణ్ అభిమానుల్ని జల్సా ఆడియోతో ఉర్రూతలూగించిన దేవిశ్రీప్రసాద్ మరోసారి పవర్ స్టార్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. 'గబ్బర్ సింగ్" చిత్రానికి దేవిశ్రీప్రసాదే సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి పాటల రికార్డింగ్ కూడా మొదలయింది.
దేవి అప్పుడే ఒక పాట కంపోజ్ చేసేశాడట. ఈ పాటని పవన్ కళ్యాణ్ కి వినిపించగా చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడట. దాంతో దేవి, డైరెక్టర్ హరీష్ శంకర్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పవన్ గత చిత్రాలు పులి, తీన్ మార్ ఆడియోలకి అంతగా పేరు రాలేదు. ఈ ఆడియోలు యావరేజ్ అనిపించుకున్నాయే తప్ప ఎక్కడా మార్మోగలేదు.
కానీ జల్సా పాటలు మాత్రం దాదాపుగా ఒక ఏడాది పాటు ఊపేశాయి. పవర్ స్టార్ ని అభిమానించే దేవి ఈసారి అంతకంటే బెటర్ ఆల్బమ్ చేయాలని తహతహలాడుతున్నాడు. ఇటీవలి కాలంలో తెలుగులో ఊపు తగ్గిన దేవిశ్రీప్రసాద్ మళ్లీ గబ్బర్ సింగ్ తో ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











