"నాని" కి ప్రేమతో.... దేవీశ్రీ ప్రసాద్
మొదటినుంచీ నానీ స్టయిలే వేరు.తన రేంజ్ లో ఉండే హీరోలందరికంటే కాస్త కొత్థ పంథాలో ఆలోచిస్తూంటాడు. అందుకే ఇప్పటివరకూ,కామెడీ హీరో,క్లాస్ హీరో,మాస్ హీరో లాంటి ముద్రలేం పడలేదు. తన మానాన తాను ఒక కొత్త పద్దతిలో వెళ్తూనే ఉంటాడు. అయితే అన్నీ ఆలోచనలూ సక్సెస్ అయ్యాయని కాదు. పైసా, జండా పై కపిరాజు లాంటి బంపర్ ఫ్లాపులూ ఉన్నాయి.అయినా భలె భలే మగాడివోయ్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసిన నాని ఇప్పుడు మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో "జెంటిల్ మేన్" గా రానున్న సంగతి తెలిసిందే..
రొమాంటిక్ థ్రిల్లర్ గా వస్తున్న "జంటిల్ మన్" సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నది. ప్రస్తుతం "ఉయ్యాల జంపాలా" ఫేం విరించి వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న నాని "సినిమా చూపిస్తామామా" ఫేం త్రినాథ రావు దర్శకత్వంలో దిల్ రాజు, బెక్కెం వేణుగోపాల్ కలిసి నిర్మించే సినిమాలో నటించడానికి కూడా అంగీకరించాడు. ఇక్కడ విశేశం ఏమితంతే ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ దర్శకత్వం వహించనున్నాడట.

సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అగ్ర హీరోల సినిమాలకి మాత్రమే కాదు, కథ నచ్చాలే గాని, ఇతర యువకథానాయకుల సినిమాలకి పనిచేయడానికి కూడా ఆయన వెనుకాడడు. ఇదే విషయాన్ని మరోమారు నిరూపిస్తూ నాని సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నాని మీద ఉన్న ప్రత్యేక్ల ఇష్టం కూడా దేవీ ఈ సినిమా ఒప్పుకోవటానికి ఒక కారణం అట.
ఈ సినిమాకి బెక్కెం వేణుగోపాల్ తోపాటు దిల్ రాజు కూడా నిర్మాత వ్యవహరించనున్నారు. ఈ సినిమా కథను దేవిశ్రీప్రసాద్ కి త్రినాథరావు వినిపించాడట. కథ బాగా నచ్చడం, నానీ హీరో కావటం తో ఇంప్రెస్ అయిన దేవీ తాను ఈ సినిమా చేస్తానంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దేవిశ్రీ సంగీతాన్ని అందించే నాని మొదటి సినిమా ఇదే... త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతున్న ఈ సినిమా తో నాని రేంజ్ ఇంకో మెట్టు ఎదిగినట్టే...


Click it and Unblock the Notifications











