వెతుకులాట: పవన్-త్రివిక్రమ్‌తో పాటు దేవిశ్రీ కూడా..!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా'(తాత్కాలిక టైటిల్) చిత్రం చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంచనంగా పూజా కార్యక్రమం జరుపుకున్న ఈచిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తమ చిత్రం కోసం అద్భుతమైన లొకేషన్లు వెతకడంలో భాగంగా యూరఫ్ ఖండంలోని స్పెయిన్ లో పర్యటిస్తున్నారు. ఈ వెతుకులాటలో తాజాగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా జాయిన్ అయ్యాడు. పనిలో పనిగా దేవిశ్రీ ఇక్కడే ఈ ఇద్దరితో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేయనున్నారు. ఈ సినిమా కోసం తను ప్రిపేర్ చేసుకున్న ట్యూన్లు వారికి వినిపించనున్నాడు.
ఈ చిత్రంలో సమంత పవన్ కళ్యాణ్ హీరోయిన్ గా నటించనుంది. పవన్ సినిమా కారణంగానే రామ్ చరణ్ 'ఎవడు'లో ఆమె అవకాశం కోల్పోయిందనే ప్రచారం కూడా జరిగింది. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జల్సా సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. జల్సా మంచి విజయం సాధించడంతో... వీరి కాంబినేషన్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందనున్న ఈచిత్రం ప్రతి సీన్ వినోదాత్మకంగా, ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీ, పంచ్ డైలాగులు మేళవించిన తనదైన శైలిలో తెరకెక్కించనున్నాడు. నటీనటుల వివరాలు, ఇతర సాంకేతిక విభాగం వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











