హరీష్ శంకర్, దేవిశ్రీకి అక్కడే చెడింది.. వాల్మీకి నుంచి తప్పుకోవడానికి కారణమిదా..?

తెలుగు, తమిళ భాషా చిత్రాల్లో సంగీత దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు దేవి శ్రీ ప్రసాద్. గత కొన్ని సంవత్సరాలుగా తన సంగీత వాయిద్యాలతో ఇండస్ట్రీని ఏలుతూ శ్రోతలకు వినసొంపైన సంగీతం అందిస్తున్నారు. తమ సినిమాలకు డిఎస్పీ సంగీతం తోడైందంటే చాలు సినిమా సగం గట్టెక్కినట్లే అన్నట్లుగా ఫీల్ అవుతారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దేవీ శ్రీ బాణీలు బాగా ఆకర్షించాయి. ఇండస్ట్రీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మార్క్ తో అందరు స్టార్ హీరోల సినిమాలకు బాణీలు కట్టారు దేవి. అదేవిధంగా ఇప్పటివరకు దేవికి ఏ డైరెక్టర్ తో విభేదాలు నెలకొన్న పరిస్థితులు చూడలేదు. కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో దేవి విభేదించారనేది తాజా సమాచారం. ఆ వివరాలు చూస్తే..

వాల్మీకి చిత్రం

వాల్మీకి చిత్రం

హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి సినిమా రూపొందుతోంది. మెగా వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ బాణీలు కట్టాల్సి ఉంది. చిత్ర ప్రారంబత్సవం రోజే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ చిత్రయూనిట్ ప్రకటన జారీ చేసింది.

ఇంతలో సడన్‌గా

ఇంతలో సడన్‌గా

వాల్మీకి విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇంతలో సడన్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి దేవి శ్రీ ప్రసాద్ తప్పుకున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో వీటిపై చిత్రయూనిట్ కూడా స్పందించక పోవడం ఆ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. దేవీ నిజంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఫిక్స్ అయ్యారంతా.

 అక్కడే చెడింది

అక్కడే చెడింది

ఇదిలా ఉండగానే దేవి శ్రీ వాల్మీకి నుంచి తప్పుకోవడానికి కారణాలు కూడా తెలుస్తున్నాయి. చిత్రంలోని ఒక రీమిక్స్ సాంగ్ విషయంలో దేవీ శ్రీ, హరీష్ శంకర్ మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయనేది ఫిలిం నగర్ టాక్. మాస్ ఆడియన్స్ ను ఓ ఊపు ఉపేలా హరీష్ శంకర్ ఓ రీమిక్స్ సాంగ్ చేద్దామని భావించారట. అయితే రీమిక్స్ సాంగ్స్ తాను చేయననీ .. ఇది తన నియమాల్లో ఒకటని దేవిశ్రీ తేల్చిచెప్పాడట. దేవి శ్రీని ఒప్పించేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోగా.. చివరకు దేవీ ఈ ప్రాజెక్ట్ నుంచే తప్పుకునే పరిస్థితి వచ్చిందట.

గతం పూజా హెగ్డే.. ఇప్పుడు దేవి

గతం పూజా హెగ్డే.. ఇప్పుడు దేవి

కొంతకాలం క్రితం తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ సినిమాగా వాల్మీకి రూపొందుతోంది. ఈ చిత్రంలో వరుణ్ సరసన పూజా హెగ్డే నటించాల్సి ఉండగా.. మొదట్లోనే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు దేవిశ్రీ విషయంలోనూ అదే ప్రచారం జరుగుతుండటం మెగా అభిమానులను కలవరపెడుతోంది.

More from Filmibeat

Read more about: devi sri prasad valmiki varun tej
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X