బెంగుళూరులో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ షో
తాజాగా బెంగుళూరు వాసులకు తన బీట్ రుచి చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు దేవిశ్రీ. ఇక్కడ తన మ్యూజిక్ షోతో లైఫ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వ బోతున్నాడు. సెప్టెంబర్ 21న బెంగుళూరులోని నేషనల్ కాలేజీ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఈ విషయమై దేవిశ్రీ తన ట్విట్టర్లో వెల్లడిస్తూ....'నాయొక్క 'ఫస్ట్ ఎవర్ షో' బెంగుళూరులో జరుగబోతోంది. మరో 3 రోజుల సమయం మాత్రమే. ఎంటో ఎగ్జైటెడ్ గా ఉంది, సెప్టెంబర్ 21న నేషనల్ కాలేజీ గ్రౌండ్స్ ఇరగదీయబోతున్నా' అంటూ ట్వీట్ చేసాడు.
బెంగుళూరు గణేష్ ఉత్సవాలు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ్రీని నిర్వహకులు ఆహ్వానించారు. 'విద్యా నారాయణ యువక సంఘ' వారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇళయరాజా, జేసు దాసు, శంకర్ మహదేవన్, షాన్, సోను నిగమ్ లాంటి ప్రముఖులు కూడా పాల్గొంటున్నరు.
ప్రస్తుతం దేవిశ్ర ప్రసాద్ పలు తెలుగు, తమిళ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. తెలుగులో రామ్ చరణ్-వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న 'నాయక్',రవితేజ హీరోగా రూపొందుతున్న 'సార్ వచ్చారు', హిందీలో రామ్ చరణ్ తొలి మూవీ 'జంజీర్', తమిళంలో సూర్య హీరోగా రూపొందుతున్న 'సింగం 2' చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












