గబ్బర్ సింగ్ కాంబో.. రేటు పెంచిన దేవి శ్రీ ప్రసాద్.. బిగ్గెస్ట్ రెమ్యునరేషన్

కాంబినేషన్ సెట్టయితే సినిమాకు సగం క్రేజ్ అక్కడే వస్తుంది. చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో చాలా ఈజీగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో ఒకసారి వర్క్ చేసిన టెక్నీషియన్ మరోసారి ఆయాన సినిమాకు పని చేస్తే అభిమానుల్లో అంచనాలు మామూలుగా ఉండవు. ఇక మ్యూజిక్ పరంగా పవన్ సినిమాలు పెద్దగా ప్లాప్ అయిన సందర్భాలు లేవు. పవన్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని సంగీత దర్శకులు కష్టపడే విధానం మంచి ఫలితాలను అందిస్తుంది.

హిట్టు కాంబో రిపీట్

హిట్టు కాంబో రిపీట్

దేవి శ్రీ ప్రసాద్ కూడా పవర్ స్టార్ అభిమానులకు గుర్తుండిపోయే పాటలను ఎన్నో ఇచ్చాడు. జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, సర్దార్ గబ్బర్ సింగ్ లోని సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్టయ్యాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక మరోసారి అదే కాంబినేషన్ లో మరో సినిమా కూడా రెడీ అవుతోంది. గబ్బర్ సింగ్ దర్శకుడు మరోసారి దేవితో కలిసి పవన్ సినిమాకు ట్యూన్స్ రెడీ చేయిస్తున్నాడు.

సినిమాక్ వచ్చేది ఎప్పుడంటే..

సినిమాక్ వచ్చేది ఎప్పుడంటే..

కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికె సినిమా సెట్స్ పైకి వచ్చి ఉండేది. అలాగే పవన్ ఒక ప్లాన్ ప్రకారం వెళ్లాలని అనుకున్నప్పటికి వైరస్ కారణంగా ఎక్కువగా రిస్క్ చేయలేకపోతున్నారు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ 28వ సినిమా 2022లో విడుదల చేయబోతున్నట్లు ముందుగానే చెప్పారు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానుంది.

రేటు పెంచిన దేవి శ్రీ ప్రసాద్

రేటు పెంచిన దేవి శ్రీ ప్రసాద్

గబ్బర్ సింగ్ తరువాత వస్తున్న కాంబినేషన్ కాబట్టి ప్రేక్షకులలో అంచనాలు భారి స్థాయిలో ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఈ సారి రాక్ స్టార్ తన రెమ్యునరేషన్ రేటును పెంచినట్లు తెలుస్తోంది. గత సినిమాలతో పోలిస్తే ఈ ఎమౌంట్ చాలా ఎక్కువని టాక్ వస్తోంది. సరిలేరు నీకేవ్వరు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది గాని పాటలు మాత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ని మెప్పించలేకపోయాయనే టాక్ వచ్చింది.

పవన్ సినిమా కోసం అన్ని కోట్లా..?

పవన్ సినిమా కోసం అన్ని కోట్లా..?

దేవి శ్రీ ప్రసాద్ అంతకుముందు సినిమాల పాటలు కూడా పెద్దగా ట్రెండ్ అవ్వలేదు. మరోవైపు థమన్ పాటలు ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయనే చెప్పాలి. పరిస్థితి ఎలా ఉన్నా కూడా దేవి తగ్గడం లేదు. పవన్ 28వ సినిమాకు రెండు కోట్ల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాకు కూడా కోటిన్నర వరకే తీసుకున్న దేవి ఇప్పుడు సడన్ గా రేటు పెంచడంతో హాట్ టాపిక్ గా మారుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X