బన్నీ టాప్ సీక్రెట్ బయటపెట్టిన దేవి శ్రీ.. పుష్ప 2 పై అంచనాలు పెంచేసిన అల్లు అర్జున్ ..

Allu Arjun in Unstoppable 4: నటసింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో 'అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే' (Unstoppable with NBK). ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‌ స్టాపబుల్ సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. సీజన్ 4లోని 4వ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గెస్ట్ గా విచ్చేశారు. ఈ షోలో అల్లు అర్జున్ టాప్ సీక్రెట్ ను మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ బయటపెట్టేశాడు. ఇంతకీ ఆ టాప్ సీక్రెట్ ఏంటీ? ఓ లూక్కేయండి.

హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న Unstoppable with NBK సీజన్ 4 నాలుగవ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఇప్పటికే ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ కు సంబంధించిన స్పెషల్ పోస్టర్లు, ప్రోమోను కూడా విడుదల చేశారు. తాజాగా అల్లు అర్జున్ కు సంబంధించిన మరో కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. తాజా ఎపిసోడ్ లో అల్లు అర్జున్ తో పాటు తన కొడుకు అయాన్, కూతురు అర్హ తో కలిసి షోలో పాల్గొన్నారు.

Devi Sri Prasad revealed Pushpa 2 Allu Arjun s top secret in Nandamuri Balakrishna s Unstoppable talk show

ఈ స్పెషల్ ఎపిసోడ్ లో బాలకృష్ణ మాటల గారడితో మాయ చేయగా.. అల్లు అర్జున్ కూడా తగ్గేదెలా అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. షోలో ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయించారు. ఈ షోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. తాను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తానని, ప్రధానంగా మహిళల జాగ్రత్త పై చాలా శ్రద్ధ కనబరుస్తానని చెప్పారు. బన్నీ కామెంట్స్ కు బాలకృష్ణ ఫిదా అయి.. నిన్ను హగ్ చేసుకోవాలని ఉందని బన్నీతో అంటాడు. తప్పకుండా అంటూ అల్లు అర్జున్ .. బాలయ్యను హగ్ చేసుకుంటారు. ఈ మూమెంట్ ప్రోమోలో హైలెట్ గా నిలించింది.

అనంతరం బాలకృష్ణ.. అల్లు అర్జున్ ను కొన్ని క్వశ్చన్ లు అడుగుతాడు. అందులో 'నీలో నువ్వు మార్చుకుందామని నిర్ణయించుకకోవాలని భావిస్తున్న విషయమేమిటి ? అని బాలయ్య ప్రశ్నించగా.. బన్నీ సీరియస్ గా ఫేస్ పెట్టి.. 'ఇక నుండి ఎర్లీగా పడుకొని.. ఎర్లీ మార్నింగ్ నాలుగు లేదా ఐదు గంటల వరకు లేచిపోదాం అనుకుంటున్నా' అంటూ ఫన్నీ ఆన్సర్ ఇస్తాడు. ఆ ఆన్సర్ కు షాక్ అయినా బాలకృష్ణ 'ఎవరితో లేచిపోదాం అనుకుంటున్నావ్ ? 'అంటూ పంచ్ వేస్తాడు. ఈ షోలో అల్లు అర్జున్ తన కెరీర్ కు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నట్లు అర్థమవుతుంది.

ఇలా ఇంట్రెసింగ్ సాగుతుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కు ఫోన్ చేస్తాడు బాలకృష్ణ. 'లాస్ట్ టైం వచ్చినప్పుడు అంతా ఫన్నీగా సాగింది. కనీసం ఈసారైనా బన్నీకి సంబంధించిన ఏదైనా సీక్రెట్ రివిల్ చేయమ్మా 'అంటూ దేవి శ్రీ ని అడుగుతాడు బాలకృష్ణ. దీంతో దేవి శ్రీ రిప్లే ఇస్తూ..తాను అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయటపెడతాననీ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పినట్లు అర్థమవుతుంది. దీంతో కంగారుపడ్డ బన్నీ.. 'నాయనా నా సినిమా మొత్తం బయట పెట్టకు' అంటూ ఫోన్ కట్ చేస్తాడు.

అనంతరం పుష్ప 2 గురించి బాలయ్య మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమా రిలీజ్ ముందే రూ. 1000 కోట్లు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిందట కదా అని బాలకృష్ణ ప్రశ్నించగా.. పుష్ప 2 సినిమా మాత్రం కచ్చితంగా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది. ఇప్పటివరకు మాస్ చూశారు.. ఉర మాస్ కూడా చూశారు.. కానీ, ఈ సినిమాలో జాతర మాస్ చూస్తారు అంటూ పుష్ప 2 పై భారీ అంచనాలను పెంచేశారు అల్లు అర్జున్. ఈ ఎపిసోడ్ ఆహా లో నవంబర్ 22న స్రీమింగ్ కాబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X