»   » 'ఆకలేస్తా అన్నం పెడతా...' : దేవిశ్రీప్రసాద్,సెక్సీ భామలతో (వీడియో)

'ఆకలేస్తా అన్నం పెడతా...' : దేవిశ్రీప్రసాద్,సెక్సీ భామలతో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: శంకర్ దాదా ఎంబి బియస్ చిత్రం కోసం దేవిశ్రీ ప్రదాస్ ట్యూన్ చేసిన 'ఆకలేస్తా అన్నం పెడతా...' అనే సాంగ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ పాట ఆ మధ్య తమిళంలోకి వెళ్లింది. ఇప్పుడు హిందీలోకి వెళ్తోంది. ఈ పాటలో దేవిశ్రీప్రసాద్ కూడా కనిపించటం విశేషం. ఈ పాట చాలా సెక్సీ గా సాగటం గమనించవచ్చు. ఆ వీడియో ఇక్కడ....

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు సంగీతం అందించే అవకాశాన్ని వదులుకున్న దేవిశ్రీ... త్వరలోనే ఓ బీ టౌన్ సినిమాకు ట్యూన్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టు తమిళ సినీ వర్గాలు అంటున్నాయి. సౌత్ లో ఇప్పటికే తనను తాను ప్రూవ్ చేసుకున్న దేవి... ఓ స్టార్ హీరో సినిమాతో బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఇందుకు సంబంధించిన చర్చలు పూర్తి అయ్యాయని... త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావొచ్చని కొందరు చెబుతున్నారు. ఎవరూ ఊహించని ఓ బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Devi Sri Prasad song Daddy Mummy in Bollywood

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్... ఇప్పటివరకు బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. అప్పట్లో సల్మాన్ హీరోగా తెరకెక్కిన రెడీ సినిమాలోని ధింక చిక సాంగ్ కు ట్యూన్స్ ఇచ్చిన దేవి... ఆ ఒక్క పాటతోనూ దుమ్మురేపాడు. అప్పటి నుంచి దేవిశ్రీప్రసాద్ బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నానే ఉన్నాయి.

English summary
Daddy Mummy from the Vijay-starrer Villu is now being used in a Bollywood film titled Bhaag Johnny. Interestingly, Daddy Mummy was a rehash of the popular Telugu number Aakkalesthe Annam Pedatha from the Chiranjeevi-starrer Shankar Dada Zindabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu