చరణ్ వేసిన స్టెప్పులకు రేపు థియేటర్లో అంతా ఊగిపోతారు: దేవిశ్రీ ప్రసాద్
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతికి విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్బంగా దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... మెగాస్టార్ గారి ఫ్యాన్స్‌ను లైన్లో నిలబెడితే మొదటి వరుసలో నేనూ ఉంటాను. చిరంజీవి గారు ఎక్కడున్నా ఫుల్ హుషారు వచ్చేస్తుంది. త్రివిక్రమ్ గారు చెప్పినట్లు మమ్మల్ని నడిపించేది ఆయనే. ఎంతో మందికి ఆయన ఇన్స్‌స్పిరేషన్. నా కెరీర్ మొదటి నుంచి ఎంకరేజ్ చేశారు. నాలాగే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తారు.

రామ్ చరణ్ నాకు సోదరుడు లాంటివాడు. చిరంజీవి డాన్స్ గురించి అంతా మాకు తెలుసు. సినిమా రీ రికార్డింగ్ చేస్తున్నపుడు నేను చరణ్ కు సాంగ్ చేస్తున్నా కూడా చిరంజీవిగారిని ఊహించుకుని చేస్తాను. ఈ సినిమాలో తస్సాదియ్యా సాంగ్ చూసినపుడు చాలా ఎగ్టైట్ అయ్యాను. చరణ్ వేసిన స్టెప్పులకు రేపు థియేటర్లో అంతా ఊగిపోతారు. కియారా కూడా సూపర్బ్ డాన్సర్.
చరణ్ బాడీ మీద టాటూ షాట్ చూసినపుడు మీరంతా ఎలా అరిచి రెస్పాండ్ అయ్యారో... రీరికార్డింగ్ థియేటర్లో మేము కూడా అలాగే రెస్పాండ్ అయ్యాం. ఆ మ్యాటర్ నాకు బోయపాటిగారు కథ చెప్పినపుడు కూడా చెప్పలేదు. సీన్ తెలుసు కానీ... అలా ఉంటుందని తెలియదు. బోయపాటిగారు తీసిన విధానం అదిరిపోయింది. దాని కోసం థియేటర్లో వెయిట్ చేస్తారనిపించింది. అక్కడ వచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆ షార్ట్ వల్ల ఇన్‌స్పైర్ అయి చేసిందే. ఇలాంటి సినిమా చేసినందుకు బోయాపాటి గారికి థాంక్స్. ఆయన ఎలాంటి సినిమా అయినా లాజిక్ వదిలి పెట్టరు అని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











