బాలకృష్ణ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జరిగింది. దేవుడి చిత్రపాలపై చిత్రీకరించిన ముమూర్తపు షాట్‌కు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటిలు కెమెరా స్విచాన్ చేసారు. దర్శకుడు బోయపాటి ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.
ఈ చిత్రానికి హీరోయిన్ ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. మొదట ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇప్పటికే వేరే నిర్మాత రిజిస్టర్ చేసుకోవడంతో పాటు దాన్ని బాలయ్య కోసం ఇవ్వడానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 'జయసింహ' టైటిల్ ఈ చిత్రానికి ఖరారు చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












