మహేష్ స్టెప్పులకు అతని దరువు తోడైతే...
టాలీవుడ్ సంగీత దర్శకుల్లో అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించి, తన వైవిధ్య మైన సంగీతంతో టాప్ రేంజ్ కు ఎదిగిన మ్యూజిక్ డైరెక్టర్లలో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ముఖ్యంగా క్లాసు, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకునేలా దరువేయడం దేవిశ్రీ ప్రత్యేకత. మరి ఇలాంటి సంగీత దర్శకుడు...క్లాసు, మాసు మెచ్చే హీరో సినిమాకు దరువేస్తే..? వచ్చే స్పందన ఎలా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.
దేవిశ్రీ ప్రసాద్ త్వరలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంగీతం అందించబోతున్నారు. మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు దేవి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ కు తొలిసారి సంగీతం అందించే అవకాశం రావడంతో కేకపుట్టించే ట్యూన్స్ కంపోజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడట దేవిశ్రీ.
మహేష్ బాబు ఈ సినిమాలో పూర్తిగా విభిన్నమైన స్టయిల్ లో కనిపించబోతున్నారు. మిల్కీ బేబీ తమన్నా మహేష్ బాబుతో రొమాన్స్ చేసే అవకాశం దక్కించుకుంది. దూకుడు సినిమాను నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతోంది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలు. ప్రముఖ కెమెరా మెన్ రత్నవేలు ఈ సినిమాకు పని చేయనున్నారు.


Click it and Unblock the Notifications











