హీరోగా దేవీశ్రీప్రసాద్ కన్ఫర్మ్!?
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ త్వరలో హీరోగా చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. మంత్ర ఫేమ్ తులసీరామ్ దర్శకత్వంలో ఎమ్.ఎస్.రాజు నిర్మించనున్న భారీ చిత్రంలో ఈ విశేషం చోటు చేసుకోనుంది.ఇందు నిమిత్తం పూజా కార్యక్రమాలు కూడా నిన్న(29 సెప్టెంబర్)ఉదయం ఎమ్.ఎస్.రాజు ఆఫీసులో జరిగినట్లు తెలుస్తోంది. మంత్ర అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న తులసీరామ్ స్క్రిప్టు పూర్తి స్ధాయిలో పూర్తి చేసి మరో సూపర్ హిట్టుకు రెడీ అవుతున్నారని వినపడుతోంది. కోడి రామకృష్ణతో చండి చిత్రాన్నిప్లాన్ చేసిన యమ్.యస్.రాజు ఈ క్రేజి చిత్రాన్ని పూర్తి చేసి వరస పరాజయాలతో ఉన్న తమ బ్యానర్ ని నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ఇక యమ్.యస్.రాజు కుమారుడు చిత్రం కూడా ఈ సంవత్సరానికి లేనట్లే నని సమాచారం. అలాగే మంత్రతో ఛార్మిని కొత్త కోణంలో చూపిన తులసీరామ్ ఆమె బోయ్ ప్రెండ్ దేవీశ్రీకి కూడా హిట్టివ్వాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











