‘కాటమరాయుడో’ సాంగ్ వివాదంపై దేవిశ్రీ వివరణ
హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా పాట పాడిన సంగతి తెలిసిందే. ఆయన పాడిన 'కాటమరాయుడో' సాంగుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో వివాదమూ తలెత్తింది. ఈ పాటను ఓ పాత సినిమా నుంచి కాపీ కొట్టారంటూ పలువురు విమర్శించడం మొదలు పెట్టారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ స్పందించారు. 'కాటమరాయుడో సాంగుకు ట్యూన్స్ నేను కంపోజ్ చేయలేదు. ఇదో ఓల్డ్ పాపులర్ ఫోక్ సాంగ్. కాబట్టి మీ ప్రశంసలన్నీ ఈ పాట యొక్క ఒరిజినల్ కంపోజర్, రచయితలకే దక్కుతాయి. త్రివిక్రమ్ సార్ ఐడియా మేరకే ఓ కామెడీ సీన్ ప్లాన్ చేసారు. అందుకే పవన్ సార్‌తో పాడించారు' అని తెలిపారు.
'ఈ పాట సుమంగళి చిత్రంలోనిది. ఈ సాంగు ఒరిజినల్ కంపోజర్, రచయిత ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ పాట క్రెడిట్ అంతా వారికే దక్కుతుంది. నాకు కాదు' అని దేవిశ్రీ తన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
దేవిశ్రీ వివరణతో వివాదం సద్దుమనిగినట్లయింది. కాటమరాయుడో సాంగు ఒరిజినల్ కంపోజర్ చిత్తూరు వి.నాగయ్య. మాలతి, ఏఎస్ రావు సింగర్స్. సముద్రాల రాఘవాచార్య ఈ పాటను రచించారు.
'అత్తారింటికి దారేది' చిత్రం ఈ నెల 9న కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్టు 9న విడుదల చేయడం లేదని, ఆగస్టు 14న విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 14న కూడా....విడుదలకు అనుకూలంగా పరిస్థితులు ఉంటేనే విడుదల చేస్తారని, లేకుంటే మరికొంత కాలం వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీమాంధ్ర ప్రాంతంలో నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












