హ్యాట్సాఫ్ టు మెగాస్టార్.. సైరా గురించి చాలా వింటున్నా.. కానీ చూడలేకపోతున్నా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం సైరా. అక్టోబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. తెలుగు సీనీ చరిత్రలో నిలిచిపోయేలా సైరాను తెరకెక్కించిన రామ్ చరణ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. సైరాలో చిరు నటనను సినీ లోకం పొగడ్తలతో ముంచెత్తుతోంది.

దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్నిపెద్ద ఎత్తున విడుదల చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన భారీ రిలీజ్ చేశారు. దీంతో మొదటి రోజే 85 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది. టాలీవుడ్ సెలబ్రెటీలు సైరాను ఆకాశానికెత్తేస్తున్నారు. చిరు నటన, సంగీతం, ఆర్ట్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతీ విభాగంలో సైరా అద్భుతమంటూ అందరూ పొగిడేస్తున్నారు.

 Devi Sri Prasad Tweet On Chiranjeevi Sye Raa Movie

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా హాట్ టాపిక్ అయిన సైరాను చూడలేకపోతున్నాను... కానీ సైరాకు వస్తోన్న స్పందన మాత్రం వింటున్నానని రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అసలే మెగా స్టార్ అభిమాని.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకుండా ఉండగలడా? కానీ విదేశాల్లో ఉండటం.. నిరంతరం ప్రయాణిస్తుండటం వల్ల సినిమాను చూడలేకపోతున్నా అంటూ ట్వీట్ చేశాడు. ప్యాషన్ ఎప్పటికి విజయం సాధిస్తుంది... మెగాస్టార్ ప్యాషన్ కు హ్యాట్సాఫ్.. కుదోస్ టు రామ్ చరణ్..సురేందర్ రెడ్డి..రత్నవేలు.. సైరా టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X