సింగపూర్లో ఇరుక్కుపోయానంటూ దేవిశ్రీ ట్వీట్
తను సంగీతం అందించిన ప్రతి సినిమా ఆడియో ఫంక్షన్లోనూ లైవ్ పెర్ఫార్మెన్స్‌తో సందడి చేసే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ 'జులాయి' ఆడియో వేడుకలో మాత్రం కనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన లేని లోటు ఆడియో వేడుకలో స్పష్టంగా కనిపించింది.
IIFA సెర్మనీలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లిన దేవిశ్రీ ...అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుని 'జులాయి' ఆడియో వేడుకలో పాల్గొనాలనుకున్నారు. కానీ అనుకోని కారణాలతో దేవిశ్రీ అనుకున్న సమయానికి హైదరాబాద్ చేరుకోలేక పోయారు.
తాను జులాయి ఆడియో వేడుకకు హాజరు కాకపోవడాని గల కారణాలను వివరిస్తూ దేవిశ్రీ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపారు. సింగపూర్ ఎయిర్ పోర్టులో ఇరుక్కు పోయాని, తాను ఎక్కవలసిన ప్లైట్ టెక్నికల్ కారణాల వల్ల డిలే అయిందని, అందుకే జులాయి ఆడియోకు హాజరు కాలేక పోతున్నానని ట్వీట్ చేశారు.
దేవిశ్రీ సంగీతం అందించిన 'జులాయి' ఆడియో ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని హెచ్ఐసిసిలో దాసరి, పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలైంది. ఈ ఆడియో ఆల్బంలో ఓ మధు అనే పాట సంగీత ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ఇదివరకు సంగీతం అందించిన 'గబ్బర్ సింగ్' ఆడియో కెవ్వు కేక పుట్టించే రేంజిలో హిట్టయిన విషయం తెలిసిందే. జులాయి ఆడియో కూడా అదే రేంజిలో హిట్టవుతుందని ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











