Devil 3 ఏళ్ల శ్రమ.. 105 రోజుల కష్టం.. డెవిల్ వివాదంపై పెదవి విప్పిన దర్శకుడు
లయన్ నందమూరి కల్యాణ్ రామ్, యువ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మించిన చిత్రం డెవిల్. అయితే ఈ సినిమాకు తొలుత నవీన్ మేడారం దర్శకుడిగా వ్యవహరించారు. అయితే కొద్ది రోజుల క్రితం ఆయనను తప్పించి.. దర్శకత్వానికి సంబంధించిన క్రెడిట్‌ను ప్రొడ్యూసర్ అభిషేక్ నామా తీసుకోవడం వివాదంగా మారింది. అయితే డిసెంబర్ 29వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు నవీన్ మేడారం స్పందిస్తూ...
నా మనసులో మెదిలిన పాయింట్‌ను డెవిల్ సినిమాగా మలచడానికి మూడేళ్ల పాటు నా జీవితాన్ని అంకింతం చేశాను. స్క్రిప్టు దశ నుంచి సినిమాగా రూపొందించడానికి కావాల్సిన స్క్రీన్ ప్లే, పాత్రలకు సరిపోయే విధంగా దుస్తులు, వాటికి కావాల్సిన ఫ్యాబ్రిక్స్, లోకేషన్ల ఎంపిక, సెట్స్ డిజైన్ వరకు నా టచ్ ఉండేలా, ఆర్టిస్టిక్ విజన్ ఉండేలా తాపత్రయపడ్డాను అని నవీన్ మేడారం అన్నారు.

డెవిల్ సినిమాను దాదాపు 105 రోజుల పాటు కరైకుడి, వైజాగ్, హైదరాబాద్ తదితర లోకేషన్లలో షూట్ చేశాను. సినిమా షూటింగ్ మొత్తంలో కొన్ని రోజులు మాత్రమే నేను పనిచేయలేదు. డెవిల్ సినిమాగా రూపొందిందంటే.. అది కేవలం నా క్రియేషన్ మాత్రమే. ఈ సినిమా కేవలం ఓ ప్రాజెక్టు మాత్రమే కాదు.. నా బిడ్డలాగా ఫీలయ్యాను. ఎవరు ఏమన్నా.. ఈ సినిమాను నవీన్ మేడారం రూపొందించారని చెబుతాను అని ఆయన తన ఇన్స్‌టాగ్రామ్ పోస్టులో తెలిపాడు.
అయితే నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ మౌనంగా, సహనంతో ఓపిక పట్టాను. కానీ నేను షూటింగ్ సమయంలో ఎలాంటి తప్పు చేయలేదని బలంగా చెబుతున్నాను. ఈ వివాదానికి ప్రధాన కారణం కుంచితంగా, ఇగోల వల్ల తీసుకొన్న నిర్లక్ష్యపూరితమైన నిర్ణయాలే. అయితే మీడియాలో వార్తలు వస్తున్నట్టు.. నేను ఎవరిపై ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు అని నవీన్ మేడారం తెలిపారు.

డెవిల్ సినిమా టైటిల్స్‌లో నా పేరుతో డైరెక్షన్ లేకపోవడం, ఆ సినిమాకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వకపోవడం నాకు హృదయాన్ని గాయపరిచింది. అయితే ఈ సినిమా ద్వారా వెలకట్టలేని నైపుణ్యం, కాన్ఫిడెన్స్ మాత్రం పొందాను. ఇక ముందు కూడా నేను ఫోకస్‌గా, కంపోజ్‌గా ఉంటూ నా కెరీర్‌ను మరింత బలంగా తీర్చిదిద్దుకొంటాను అని నవీన్ మేడారం అన్నారు.
డెవిల్ సినిమా హీరో కల్యాణ్ రామ్ సార్.. మంచి మనసున్న వ్యక్తి. ఈ సినిమా కోసం వందశాతం తన వంతుగా శ్రమించారు. ఈ ప్రాజెక్ట్ సమయంలో నాకు సహకారం అందించిన కల్యాణ్ రామ్‌కు, ప్రతీ ఒక్కరికి నేను రుణపడి ఉంటాను. డెవిల్ బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. నేను ఓ కొత్త సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాను. త్వరలోనే ఎక్సైటింగ్ స్క్రిప్టుతో మీ ముందుకు వస్తాను. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాను అని నవీన్ మేడారం తెలిపాడు.


Click it and Unblock the Notifications











