రామ్ చరణ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ ఖరారు
రామ్ చరణ్ 'జంజీర్' సినిమాతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నారని తెలిసింది. ఈ చిత్రంతో దేవి బాలీవుడ్ లో పూర్తిస్థాయిలో రంగప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. షూట్ ఎట్ లోకండ్ వాలా దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రం డైరక్ట్ చేస్తున్నారు. మొన్న రచ్చ ఆడియో పంక్షన్ కి కూడా అపూర్వ లఖియా వచ్చి పాల్గొన్నారు. ఇక ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో జంజీర్ రీమేక్ ని రామ్ చరణ్ తో చేస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా మీడియాతో చెప్పారు. అప్పటి కథని ఈ తరానికి తగినట్లు మార్చి స్క్రిప్టు తయారు చేసానని చెప్పుకొస్తూ ఈ విషయం వివరించారు.
అలాగే జర్నిలిస్టు జె డి ని చంపే ఎపిసోడ్ ని కూడా ఈ స్క్రిప్టులో కలుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ అయ్యిన స్టార్ హీరోయిన్ ని రామ్ చరణ్ ప్రక్కన తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే రామ్ చరణ్ ని తన కథకు ఎంపిక చేసుకోవటం గురించి చెపుతూ...నేను ఓ యంగ్ ,ఎనర్జీ ఉన్న యంగ్ హీరో కోసం వెతికాను. జంజీర్ కథ కోపంతో రగిలిపోయే యాంగ్రీ యంగ్ మ్యాన్ కథ. ఈ రోజున బాలీవుడ్ లో ఇలాంటి పాత్రలు చేసే యంగ్ హీరోలు లేరు. అంతా మెట్రో సెక్సువల్ హీరోలే అన్నారు. ఆ ఫైర్ రామ్ చరణ్ లో కనిపించింది. అందుకే అతన్ని కలిసి ఒప్పించుకున్నాను అన్నారు.


Click it and Unblock the Notifications











