జల్సాలో దేవిశ్రీ ప్రసాద్??
దేవీశ్రీప్రసాద్ ను చూస్తే హీరోలకు కచ్చితంగా అసూయ కలుగుతుందనడంలో సందేహంలేదు. డాన్స్ చేయడం రానివారికి మరీను. ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ దేవీశ్రీ ప్రసాద్ ఉంటే షో క్రెడిట్ నంతా తన సొంతం చేసుకుంటాడు. పాటా పాడతాడు...దానికి డాన్స్ చేస్తాడు..హీరోయిన్లుంటే వారితో కాలు కదుపుతాడు. హీరోలు అక్కడున్నా ప్రేక్షక పాత్రే పోషించాల్సిన పరిస్థితిని కల్పిస్తాడు.
తన సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటకు 70ఎమ్ఎమ్ తెరపై చిందులేసి కనిపించనున్నాడు. ఇంతకుముందు చిరు సినిమాలో డాన్స్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇపుడు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జల్సా సినిమాలో డాన్స్ చేస్తున్నాడట. ఈ సినిమాకు సంగీత దర్శకుడు కూడా దేవీశ్రీ ప్రసాదే కావడం విశేషం.


Click it and Unblock the Notifications











