ఛార్మితో ఎఫైర్ పై దేవిశ్రీ ప్రసాద్
ఛార్మితో దేవీకి త్వరలో పెళ్ళి అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. అంతేగాక ఛార్మి సైతం దేవిశ్రీ ప్రసాద్ ప్రేమలో మునగితేలుతోందంటూ చెప్పుకొచ్చారు. ఆమె ఉన్న సెట్స్ మీదకు దేవి పని ఉన్నా లేకపోయినా వెళ్ళి అటెండవుతున్నాడంటూ వినపడ్డాయి. ఈ మధ్య ఆ వార్తల జోరు తగ్గింది కానీ వీరి ఎఫైర్ పై అనుమానాలు మాత్రం వీడలేదు. వీటినన్నటినీ దృష్టిలో పెట్టుకునే దేవి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలపై క్లారిటీగా చెప్పుకొచ్చారు.
ఆమె గురించి చెబుతూ..ఛార్మి నా బెస్ట్ ఫ్రెండ్, తను ఎవరితోనయినా కలిసిపోతుంది. చాలా మంచిది. తెలుగుమ్మాయి కాకపోయినా తెలుగు బాగా మాట్లాడతుంది. అలాగే ఎదిటి వ్యక్తి కష్టాల్లో ఉంటే వెంటనే సాయిం చేయటానికి ముందుకొస్తుంది. వారితో తన పరిచయం ఎంత అని చూసుకోదు. అన్నిటికి మించి మంచి నటన ఆమె సొంతం. అంతేగాక నాతో ప్రెండ్లీగా మూవ్ అవుతుంది ఇవన్నీ నిజాలు. ఇక ఆమెతో నా పెళ్ళంటారా అది మాత్రం అబద్దం అంటున్నాడు దేవిశ్రీప్రసాద్.


Click it and Unblock the Notifications











