గబ్బర్ సింగ్....అది నకిలీదేనా?
బాలీవుడ్ 'దబాంగ్' చిత్రానికి తెలుగు రీమేక్‍గా రూపొందుతున్న పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్'చిత్రంలో 'మున్నీ బద్నాం...' ఐటెం పాట స్థానంలో ''బావా బావా ... నీదే ఈ పాలకోవా '' అనే పాటను తెలుగు వెర్షన్ కి రూపొందించారంటూ ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన పాట కూడా ఇంటర్నెట్‌లో వినిపిస్తోంది. అయితే ఇదంతా అసత్య ప్రచారం అని, గబ్బర్ సింగ్ ఐటం సాంగుగా చెప్పబడుతున్న ఆ పాట నకిలీ పాటే అని తేల్చేశారు ఆ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈయనగారి మాటలను బట్టి గబ్బర్ సింగ్ పాటలు ఏవో తెలుసుకోవాలంటే....ఏప్రిల్ మొదటి వారంలో జరిగే ఆడియో వేడుక వరకు ఆగాల్సిందే.
కాగా...గబ్బర్ సింగ్ చిత్రంలో ఐటం సాంగుకు నిన్నటి వరకు 'డిపార్ట్ మెంట్' ఐటం గర్ల్ నతాలియాను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపించినా...చివరకు 'దబాంగ్' ఐటం గర్ల్ మలైకా అరోరా ఖరారైనట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ కొండవీడు పోలీస్ పాత్రలో, హీరోయిన్‌గా శృతి హాసన్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. అభిమన్యుసింగ్ విలన్ పాత్రలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. మే 9న ఈచిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











