నాగార్జున ‘భాయ్’కి... షూరూ చేసిన డిఎస్‌పి
హైదరాబాద్: కింగ్ నాగార్జున త్వరలో 'భాయ్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అహ నా పెళ్లంట, పూలరంగడు వంటి హిట్ చిత్రాలను రూపొందించిన వీరభద్రం చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. లీడర్, మిరపకాయ్ చిత్రాల ఫేం రీచా గంగోపాధ్యాయ్ ఇందులో కథానాయిక.
ఇప్పటికే నాగార్జున నటించిన మన్మధుడు, కింగ్, డమరుకం చిత్రాలకు సంగీతం అందించి.... తాజాగా 'భాయ్' చిత్రానికి కూడా అవకాశం దక్కించుకున్న దేవిశ్రీ ప్రసాద్(డిఎస్‌పి) ఈచిత్రం కోసం మ్యూజిక్ కంపోజింగ్ మొదలు పెట్టాడు. ఈ సంవత్సరాంతంలోగా కంపోజింగ్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.
'భాయ్' చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. అదే విధంగా యాక్షన్, కామెడీ మిళితమై ఉంటుంది. ఇప్పటికే స్ర్కిప్టు వర్క్ పూర్తయిందని, కింగ్ నాగార్జున బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా ఆయన పాత్ర ఉంటుందని దర్శకుడు వీరభద్రం చౌదరి ఆ మధ్య ఓ సందర్భంలో వెల్లడించారు.
నా గత రెండు చిత్రాలకంటే అద్భుతంగా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఆయన మాటలను బట్టి అహ నా పెళ్లంట, పూలరంగడు చిత్రాలను మించిన ఎంటర్ టైన్మెంట్ ఈచిత్రంలో మనకు లభిస్తుందని చెప్పొచ్చు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: నాగార్జున, దర్శకత్వత్వం: వీరభద్రం చౌదరి. ప్రస్తుతం నాగార్జున 'లవ్ స్టోరీ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అంటే డిసెంబర్లో ఈచిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











