దేవి, ఛార్మి సయ్యాట నిజమే!?

By Staff

ఛార్మి సరసన దేవిశ్రీ ప్రసాద్ కనిపించనున్నాడు అంటూ ఆ మధ్య వార్తలు రావటం వాటిని కొట్టిపరేయటం జరిగిన సంగతే. అయితే సయ్యాట పేరుతో రెడీ అవుతున్న ఈ చిత్రంలో దేవీశ్రీ ప్రసాద్ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడని విశ్వసనీయసమాచారం. అయితే అతను ఈ చిత్రంలో హీరోనా,కాదా అన్నది మాత్రం తెలియనివ్వటం లేదు. ఇక దీనికి తోడు ఛార్మి, దేవిల కాంబినేషన్‌లో ఓ సన్నివేశంతో పాటు ఒక పాట చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ లోని ఎయిర్‌ పోర్ట్‌ సమీపంలో 40 లక్షలతో భారీ సెట్‌వేశారు.

అక్కడ మంగళవారం నుంచి అక్కడ మూడురోజులపాటు వర్క్‌ జరగాల్సి ఉంది. అయితే ప్రకృతి సహకరించకపోవటంతో షూటింగ్‌ వాయిదాపడింది. ఇక ఈ చిత్రంలో ఛార్మి కి జోడిగా అజయ్ (ఆ ఒక్కడు హీరో) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు పవన్ డైరక్ట్ గా పరిచయం అవుతున్నాడు. శ్రీకాంత్ తో యమగోల మళ్ళీ మొదలైంది చిత్రాన్ని నిర్మించిన రాజశేఖర్ ఈ సినిమాని తన ప్రేమ్స్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఛార్మి నటించిన 16 డేస్, కావ్యాస్ డైరీ, ఫ్లాఫ్ కావటం, మాయగాడు రిలీజ్ లేటవటంతో ఈ చిత్రంపై పెద్దగా క్రేజ్ రావటం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X