సుకుమార్ గారు అమేజింగ్ హ్యూమన్ బీయింగ్: దేవిశ్రీ
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' విజయోవ్సం వేడుక హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌తో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...రంగస్థలం సినిమా నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. అలాంటి అద్భుతమైన సినిమా తీసినందుకు ముందు సుక్కు భాయ్‌కి థాంక్స్. సుక్కు భాయ్‌కి ఎప్పుడు సక్సెస్ వచ్చినా అది మా సక్సెస్‌గా ఫీలవుతాం....అన్నారు.
సుక్కుగారు ఒక ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్టర్ అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. చాలా మందికి తెలియని విషయం ఆయన అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. మనం ఏ పని చేసినా దాని సక్సెస్ మనకు మాత్రమే కాదు, మనతో పాటు పని చేసిన అందరికీ సొంతం అనే ఫీలింగులో ఆయనలో ఎప్పటికీ ఉంటుంది. సుక్కుగారు తన టీంను ఎంతో బాగా చూసుకుంటారు. ఇంపార్టెంట్ క్రెడిట్స్ కూడా ఆయన టీంకు ఇస్తారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. మైత్రి మూవీస్ వారికి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా సరిపోదు.... అని దేవిశ్రీ అన్నారు.

మనం అందరం రామ్ చరణ్‌ను చిట్టిబాబు అని పిలుచుకుంటున్నాం. ఆయన కెరీర్లోనే ఇది ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. ఆయన పెర్ఫార్మెన్స్‌ను ఇంకా ఎలా రీడిఫైన్ చెయ్యాలో కూడా తెలియడం లేదు. అంత అద్భుతంగా చరణ్ చేశారు. రామలక్ష్మిగా సమంత నిజంగానే అందరికీ ఎంత సక్కగున్నదే అనిపించింది. జగపతి బాబుగారు ఇందాక అన్నారు దేవి నా వెనక ఉండి మంచి మ్యూజిక్ ఇస్తారని, కానీ అసలు విషయం అదికాదు.... ప్రెసిడెంట్ పాత్రలో ఆయన్ను స్క్రీన్ మీద చూస్తుంటే మాకే భయం వేస్తోంది. బాగా చేయకపోతే మమ్మల్ని ఎక్కడ లేపేస్తాడో అని భయంతో చేశాం కాబట్టే మ్యూజిక్ ఇంత బాగా వచ్చింది.
సుక్కు భాయ్ తర్వాత మా టీంలో ఇంకో ఇద్దరికీ నేను థాంక్స్ చెప్పాలి. అందులో ఒకరు చంద్రబోస్ గారు, ఆయన తన సాహిత్యంతో ప్రతి ట్యూన్‌కు జీవం పోశారు. ఆయన రాసిన వర్డ్స్ కే నేను ట్యూన్ చేశాను. రత్నవేలు గారికి నేను పెద్ద అభిమానిని. ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాను.... అని దేవిశ్రీ తెలిపారు.


Click it and Unblock the Notifications











