»   » రామ్ చరణ్ కి ది బెస్ట్ ఇవ్వాలనుకొంటున్నాడు....

రామ్ చరణ్ కి ది బెస్ట్ ఇవ్వాలనుకొంటున్నాడు....

Posted By:
Subscribe to Filmibeat Telugu

మగధీరుడు మళ్ళీ విజృంభించడానికొస్తున్నాడు. 'చిరుత'లా పరిచయమై 'మగధీర'లా రికార్డ్స్‌ బద్దలుకొట్టి తన సత్తాచాటిన మేరునగధీరుడు మగధీరుడు రామ్‌ చరణ్‌ తన నాల్గవ చిత్రంగా ఒక 'మెరుపు'లాంటి చిత్రం చేస్తున్నాడు. రామ్ చరణ్, తమిళ దర్శకుడు ధరణి కాంబినేషన్లో మెరుపు చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మగధీర'లో మంచి బ్యూటిఫుల్‌ , పవర్‌ఫుల్‌ మెగా పెయిర్‌గా కనువిందు చేసిన మిత్రవింద కాజల్‌ నాయకిగా చేస్తోంది. ది గ్రేట్‌ ఇండియన్‌ కెమెరామెన్‌ పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌ హీరో దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ కెరియర్ చాలా డల్ గా ఉంది. తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నాడు. ఈ సంగీత దర్శకుడు. దేవి స్థానాన్ని థమన్ కైవసం చేసుకున్నాడని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే తన కెరియర్ డైలమాలో పడుతుందని భావించిన దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం తను చేస్తున్న రామ్ చరణ్ 'మెరుపు" చిత్రానికి ది బెస్ట్ ట్యూన్స్ ఇవ్వడానికి కషి చేస్తున్నాడట. సంగీతం పరంగా 'మెరుపు" బిగ్గెస్ట్ హిట్ సినిమా అనేలా చేయాలనే పట్టుదలతో దేవి ఉన్నట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu