బన్నీ 'ఇద్దరు అమ్మాయిలతో..'కి సంగీతం చక్రి కాదు
హైదరాబాద్: అల్లు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న 'ఇద్దరు అమ్మాయిలతో..'చిత్రానికి సంగీతం చక్రి అందించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ లోకి దేవిశ్రీప్రసాద్ వచ్చారు. బన్నీ మాట మీద చక్రిని కాదని దేవిని ఈ ప్రాజెక్టులోకి తెచ్చినట్లు సమాచారం. దేవి కూడా తొలిసారిగా పూరి జగన్నాధ్ సినిమాకు పనిచేస్తున్నారు. దేవి,బన్ని కాంబినేషన్ లో చాలా హిట్స్ గతంలో వచ్చాయి. మొన్న వచ్చిన జులాయి చిత్రానికి కూడా దేవినే మ్యూజిక్ డైరక్టర్.
గతంలో 'దేశముదురు' వంటి హిట్ సినిమా చేసిన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ జోడీ తాజాగా 'ఇద్దరమ్మాయిలతో...' అనే సినిమా చేయబోతున్నారు. ఇటీవలే 'గబ్బర్‌సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శివబాబు బండ్ల సమర్పిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రారంభం కానున్నది.
ఈ సంగతిని పూరి జగన్నాథ్ తెలియజేస్తూ "ఈ కథ విని బన్ని ఎంతో ఎగ్జయిట్ అయ్యాడు. ఇద్దరమ్మాయిలతో బన్ని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. మా కాంబినేషన్‌లో మరో విభిన్న చిత్రంగా ఇది రూపొందనుంది'' అని చెప్పారు. బండ్ల గణేశ్ మాట్లాడుతూ "బన్ని, జగన్ కాంబినేషన్‌లో మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ కోసం జగన్నాథ్ అద్భుతమైన కథ సిద్ధం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు'' అని తెలిపారు.
ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని దర్శకుడు పూరి జగన్నాథ్ సమకూరుస్తున్నారు. 2013 జనవరికి విడుదల అయ్యే ఈ చిత్రం కథ కేవలం ట్రీట్ మెంట్ బేసెడ్ గా నడుస్తుందిని సమాచారం. ఇందులో బన్ని సరసన ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ చేసే అల్లరినే ప్రత్యేకంగా ఫన్ తో కలిసి పూరీ స్క్రిప్టు రెడీ చేసాడని ఫిల్మ్ నగర్ సమాచారం. దాదాపు పెద్ద హీరోలందరూ చేసిన ఈ ఫార్ములా ఈ మధ్య కాలంలో ఎవరూ టచ్ చేయటం లేదు. దాంతో పూరీ ఈ పాయింట్ నే తన దైన శైలిలో ట్రీట్ మెంట్ ఇచ్చి రెడీ చేసి,బన్ని కి వినిపించి డేట్స్ ఓకే చేయించుకున్నారు.


Click it and Unblock the Notifications











