twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రేజ్ కోసం కక్కుర్తితో చేయకూడనివి చేసారు, డైరక్టర్ అరెస్ట్, నిర్మాత కోసం గాలింపు

    ద్యావుడా సినిమా డైరెక్టర్‌ దాసరి సాయిరామ్‌ను హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

    By Srikanya
    |

    హైదరాబాద్‌: చెత్త ఐడియాతో ఓ క్రేజ్ క్రియేట్ చేసి, సినిమా బిజినెస్ చేసుకుందాం, జనాలను ఎట్రాక్ట్ చేద్దాం అనే దర్శక,నిర్మాతలకు పోలీసలు కళ్లం వేసారు. ఈ మధ్యకాలంలో రిలీజ్ కు ముందే కేవలం టీజర్ ద్వారా వివాదం రేపిన చిత్రం ద్యావుడా. ఈ సినిమా డైరెక్టర్‌ దాసరి సాయిరామ్‌ను హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సినిమాలో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర సన్నివేశాలను యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసినందుకు గాను సాయిరామ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ రమేశ్‌ నాయుడు తెలిపారు.

    శివలింగంపై అభ్యంతరకర దృశ్యాలను చిత్రీకరించినందుకు దేవుడా చిత్ర దర్శకుడు సాయిరాంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ చిత్ర నిర్మాత హరికుమార్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయిరామ్‌ నగరంలోని ఫిలింనగర్‌లో నివసిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కడప నగరానికి చెందిన గజ్జల హరికుమార్‌రెడ్డి నిర్మిస్తున్న ద్యావుడా సినిమాకు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

    పూర్తి వివరాల్లోకి వెళితే...దర్శ‌కుడు సాయిరాం దాసరి తెలుగులో తెర‌కెక్కిస్తున్న'దేవుడా' సినిమాపై భజరంగ్ దళ్ కార్యకర్తలు స‌హా ప‌లువురు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ఇటీవ‌లే హైదరాబాద్, నేరేడ్‌మెట్‌ పోలీసుల‌తో పాటు కూక‌ట్ ప‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉంద‌ని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

    యూట్యూబ్‌లో విడుద‌ల చేసిన ఈ సినిమా టీజర్‌లో బీరుతో శివలింగానికి అభిషేకం, సిగరెట్‌తో ధూపం వెలిగించ‌డం, వెంకటేశ్వర స్వామి ఫొటోను నేలకేసి కొట్టడం వంటి స‌న్నివేశాలు చూపించినందుకు గానూ భ‌జ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఈ రోజు 'దేవుడా' చిత్ర దర్శకుడు సాయిరాంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మ‌రోవైపు ఈ చిత్ర నిర్మాత హరికుమార్‌రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    ‘Devuda’ movie director arrested

    ద్యావుడా పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హిందూ దేవుళ్లను అభ్యంతరకరంగా చూపించారని కొంత మంది కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా దేవుడి పటాన్ని నేలకేసి కొట్టడం. శివలింగానికి మధ్యంతో అభిషేకం చేసి సిగరెట్లతో దూపం వేయటం లాంటి సీన్స్ వివాదాస్పదమవుతున్నాయి.
    హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న ఈ టీజర్ ను వెంటనే యూట్యూబ్ నుంచి తొలగించాలన్న డిమాండ్ చేసారు.

    దాంతో ద్యావుడా సినిమా దర్శకుడు సాయిరాం దాసరి పత్రికాముఖంగా హిందువులకు క్షమాపణలు తెలిపారు. కొత్త సంవత్సరం మొదటి రోజున విడుదలైన ఈ సినిమా టీజర్ విపరీతంగా అలజడి సృష్టించింది. దాంతో దర్శకుడు స్పందించి, టీజర్ డిలేట్ చేసారమన్నారు. కానీ యూట్యూబ్ లో ఆ టీజర్ కనపడుతూనే ఉంది.

    ''హిందువుల మనో భావాలను దెబ్బతీయాలనేది నా ఉద్దేశం కాదు. నేనూ హిందువునే. కానీ ఇంతమంది నా సినిమా టీజర్‌ చూసి స్పందిస్తుంటే దానికి బాధ్యత వహిస్తూ ముందుగా హిందూ సోదరులందరికీ క్షమాపణ తెలుపుతున్నాను.

    కాకపోతే కర్ణాటకలోని ఉజ్జయిని దేవాలయంలో సిగరెట్లు, మద్యంతో శివునికి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆచారం ఉంది. మేము ఆ ఆచారాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాలో చివరికి శివమహత్యాన్ని చూపించే ప్రయత్నం చేశాం. కానీ సినిమా విడుదలకు ముందే భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావించి.. ఆ దృశ్యాలను మా సినిమా నుంచి తొలగిస్తున్నాము. ఈ సందర్భంగా మరోసారి తెలుగు భక్తులకు నేను క్షమాపణ తెలుపుతున్నాను'' అని ఆ ప్రకటనలో తెలిపారు.

    ''లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న మూడు జంటలు ఓ పామ్‌హౌ్‌స్‌‌‌కి వెళ్లినప్పుడు దేవుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చాడు అన్న భిన్నమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం'' అని నిర్మాత చెప్పారు.

    English summary
    Rachakonda police on Thursday arrested Telugu movie director Dasari Sairam, who directed ‘Devuda’, on charges of hurting religious sentiments and promoting enmity through visual content.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X