twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కథ లేకుండా ‘దేవుడు చేసిన మనుషులు’: పూరి

    By Bojja Kumar
    |

    రవితేజ, ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుదిన చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో బీవిఎస్ఎన్ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం ఆడియో శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది. తొలి సీడీని ఎంఎం కీరవాణి ఆవిష్కరించి రవితేజ, ఇలియానా, పూరి జగన్నాథ్‌లకు అందించారు.

    ఈ సందర్భంగా పూరి మాట్లాడుతూ...ప్రతి సినిమాకు కథ రాసుకుంటాం, కానీ కథ లేకుండా సినిమా తీద్దామని అనుకుని 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తీసినట్లు పూరి తెలిపారు. ఇందులో రవితేజ క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఇలియానా టాక్సీ డ్రైవర్ గా నటించింది. రఘు కుంచె చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడని పూరి చెప్పుకొచ్చారు.

    రవితేజ మాట్లాడుతూ పూరి జగన్నాథ్‌ నమ్మకమే తనను ఈ స్థానంలో నిలబెట్టిందన్నారు. పాటలు మంచి విజయం సాధించాలని, రఘుకుంచెకు మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆశించారు. 'నా కెరీర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుందని' ఇలియాన పేర్కొన్నారు. రఘుకుంచె మాట్లాడుతూ... అందరూ దేవుడు చేసిన మనుషులే కాని నన్ను మాత్రం పూరి చేశాడు..నారు పోసిన వాడు నీరు పోస్తాడు అంటారు.. ఆనాడు సింగర్‌గా నారు పోస్తే.. ఈనాడు మ్యూజిక్‌ డైరక్టర్‌గా నీరు పోశాడని చెప్పారు.

    ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో బోయపాటి శ్రీను, అలీ, బొమ్మరిల్లు భాస్కర్, గోపీచంద్ మలినేని, వీరభద్రం చౌదరి, డీవివి దానయ్య, గణేష్ బాబు, బూరుగుపల్లి శివరామకృష్ణ, కోనవెంకట్‌లతో ఈ చిత్రానికి సమర్పకులు వ్యవహరిస్తున్న రిలయన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు, ఈ చిత్రం ఆడియో రైట్స్ దక్కించుకున్న సోనీ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

    పూరి వ్యాఖ్యలతో సినిమాపై సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగి పోయాయి. అసలే పూరి జగన్నాథ్. సినిమాలను ప్రేక్షక రంజకంగా తీయడంలో ఎక్స్ పర్ట్. ఈ కాలంలో కథ, కథనం సరిగ్గా ఉన్న సినిమాలే సరిగా నిలబడటం లేదు. మరి కథే లేకుండా మొదలు పెట్టిన 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం ఎలా ఉండబోతోంది? అనేది ఆసక్తి కరంగా మారింది.

    ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం: రఘు కుంచె, ఎడిటింగ్: ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత: బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Mass Maharaja Ravi Teja's upcoming film "Devudu Chesina Manushulu" has been released yesterday (June 22) in Hyderabad. M M Keeravani released the first CD and handed it over to Ravi Teja, Ileana and Puri Jagannath while Bomarillu Bhaskar and Boyapati Srinu released the theatrical trailers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X