twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'యేమి సేతురా లింగా...'అంటున్న రవితేజ

    By Srikanya
    |

    రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. ఈ చిత్రం ఆడియో 22 వ తేదీ శిల్పకళా వేదికలో భారీగా విడుదల అవుతోంది. ఈ ఆడియోలో టీవి నైన్ లో పాపులర్ అయిన 'యేమి సేతురా లింగా...' అనే ట్యూన్ తో ఉండే పాట ఉండబోతోందని తెలుస్తోంది. ఆ ట్రాక్ లిస్ట్ ఇదే...

    1)సుబ్బ లక్ష్మీ ...

    సింగర్ రఘు కుంచె

    2)నువ్వేలే నువ్వేలే....

    సింగర్ శ్రేయా ఘోషల్

    3)డిస్టర్బ్ చేత్తన్నదే

    సింగర్ సుచిత్ర

    4)యేమి సేతురా...

    సింగర్ ఉదిత్ నారాయణ్,చిన్నమయి

    5)నువ్వంటే చాలా..
    సింగర్స్ అద్మన్ సామి,జోన్న

    6)దేవుడా..దేవుజా

    సింగర్స్ ...రఘుకుంచె,అంజనా సౌమ్య

    ఈ చిత్రం కాన్సెప్టు గురించి పూరీ జగన్నాధ్ చెపుతూ...దేవుడు ఎంతో మంచివాడు. అందుకే చేతులెత్తి దణ్నంపెడుతున్నాం. మరి ఆ దేవుడు చేసిన మన మనుషుల్లో మంచివాళ్లు ఎంతమంది? కర్త, కర్మ, క్రియ... అన్నీ మనమే అయినా ఆ పైవాడిపైనే భారం మోపుతూ ఎలాంటి పనులు చేస్తున్నాం? దేవుడే చేసిన ఓ యువకుడు సమాజానికి ఏం చెప్పాడు? తదితర విషయాలు తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంన్నారు.

    దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు. అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ...ఇటీవల బ్యాంకాక్‌లో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.


    రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.

    English summary
    The shooting of Ravi Teja’s upcoming movie Devudu Chesina Manushulu under the direction on Puri Jagannadh is now complete.Currently, the post production activity of the movie is going on at brisk pace. The audio of this much awaited film will be launched on June 22 in Shilpakala Vedika.Puri Jagannath himself confirmed this in social networking site, Twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X