దేవుడు చేసిన మనుషులు-రవితేజ, ఇలియానా అనాధలా?
మాస్ మహరాజ్ రవితేజ, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 17నే ఈ చిత్రం పూరి జగన్నాథ్ ఆఫీసులో లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ చిత్రం యొక్క తాజా వివరాల్లోకి వెళితే....రెగ్యులర్ షూటింగ్ బ్యాంకాక్‌లో నిన్న ప్రారంభం అయింది. రవితేజ సరసన ఇలియానా నటిస్తోంది. గతంలో ఖతర్నాక్, కిక్ చిత్రాల్లో కలిసి నటించి ఈ జంట ఈ చిత్రం ద్వారా మూడోసారి జత కడుతోంది. దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతల ఉన్నారు. జూన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
చిత్ర యూనిట్ సభ్యుల నుంచి విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రంలో రవితేజ, ఇలియానా అనాధలుగా నటిస్తున్నారని సమాచారం. పూరి గత చిత్రాల కంటే భిన్నంగా, ఒక విభిన్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 'దేవుడు చేసిన మనుషులు' అని ఓల్డ్ టైటిల్ పెట్టడం వెనక కూడా ఓ ప్రత్యేకత ఉందట. సినిమాకు సంబంధించిన వివరాలను దర్శకుడు పూరి త్వరలో వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











