‘దేవుడు చేసిన మనుషులు’ స్టోరీ లైన్ ఇదేనా?
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఐదో సినిమా 'దేవుడు చేసిన మనుషులు'. ఈచిత్రం టైటిల్‌కు తగిన విధంగానే సినిమా స్టోరీ ఉందని స్పష్టం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ దేవుళ్లుగా విష్ణుమూర్తి, లక్ష్మి దేవి పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.
ఒక రోజు లక్ష్మిదేవి తెలుగు సినిమా చూడాలనికుటుంది. అయితే అది రీల్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో విష్ణుమూర్తి సృష్టించిన పాత్రలతో చూడాలనుకుంటుంది. తొలుత విష్ణుమూర్తి ఇందుకు ఒప్పుకోక పోయినా....నారదుడు(జూనియర్ రేలంగి) కల్పించుకుని విష్ణుమూర్తిని ఒప్పిస్తాడు.
ఈ మేరకు పాత్రల రూపకల్పన చేసిన విష్ణుమూర్తి....రవితేజను ఇండియాలో, ఇలియానాను బ్యాంకాక్‌లో పుట్టిస్తాడు. ఈ రియల్ లైఫ్ సినిమాలో లక్ష్మి దేవి నవరసాలైన రొమాన్స్, కామెడీ, యాక్షన్, సెంటిమెట్ ఇలా అన్నీ ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో లార్డ్ విష్ణు ఇవన్నీ ఆయా పాత్రలకు యాడ్ చేస్తూ ఉంటాడు. ఇలా పలు రకాల ట్విస్టులతో సినిమా సాగుతూ ఉంటుందట.
ఈ చిత్రం ద్వారా రవితేజ సరసన ఇలియాన మూడోసారి జతకడుతోంది. బివిఎస్ఎన్ ప్రసాద్ రియలన్స్ ఎంటర్ టైన్మెంట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా తదితరలు నటిస్తున్నారు. సంగీతం : రఘు కుంచె, ఎడిటింగ్ : ఎస్ ఆర్ శేఖర్, నిర్మాత : బివిఎస్ఎం ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పూరి జగన్నాథ్


Click it and Unblock the Notifications











