ఆగస్టు 15న ‘దేవుడు చేసిన మనుషులు’
మాస్ మహరాజా రవితేజ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి బేనర్ పై భారీ చిత్రాల నిర్మాత చత్రపతి ప్రసాద్ నిర్మిస్తున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రాన్ని ఆగస్టు 15న వరల్డ్ వైడ్‍గా రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా చిత్రాన్ని ఆగస్టు 15న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ముందే సినిమాలోని అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న మరో హిట్ మూవీ ఇది. ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్‌గా ఈచిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు.
మాస్ మహారాజ్ రవితేజ సరసన గ్లామర్ స్టార్ ఇలియానా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యతిరానా, మానస, గాబ్రియల్ తదితరులు నటిస్తున్నారు.
ఫోటో గ్రఫీ: శ్యామ్ కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, సంగీతం : రఘు కుంచె, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంథోని, దినేష్, స్టిల్స్: సాయి మాగంటి, కో-డైరెక్టర్: విజయరామ్ ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ రాజు ఆర్, క్యాషియర్: జంగపల్లి మొగలి, సమర్పణ: రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, కో-ప్రొడ్యూసర్స్: భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











