రవితేజ ‘దేవుడు చేసిన మనుషులు’ రిలీజ్ వాయిదా
రవితేజ-ఇలియానా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం ఈ నెల చివర్లో(జులై 27న) రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసినప్పకీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈచిత్రాన్ని ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసిట్లు తెలుస్తోంది.
పూర్తి ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఆడియో సూపర్ హిట్ అయింది. పాటలు ఎనర్జిటిక్‌గా ఉండటంతో రవితేజ, పూరి మార్కుతో వారి గత సినిమాల మాదిరి ఈచిత్రం కూడా మంచి వినోదాత్మక చిత్రంగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయట. మరి ప్రేమ పుట్టుక కూడా అక్కడే జరుగుతుందా? ఎవరు ఎవరిని ప్రేమించాలో దేవుడే నిర్ణయిస్తాడా? ప్రేమ అనే కాదు... ఈ సృష్టిలోని సమస్త విషయాలకూ బీజం భగవంతుడే వేస్తాడు. దేవుడికి అదో ఆట. ఈసారి ఆయనకు మరో ఇద్దరు దొరికారు... ఏదో మాయ చేసి వారిద్దరి మధ్య ప్రేమ సృష్టించాడు. మరి ఆ జంట ప్రేమ ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాలి అంటున్నారు పూరి.
మాస్ మహరాజ్ రవితేజ సరసన గ్లామర్ స్టార్ ఇలియానా నటిస్తున్న ఈచిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్. నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతిరానా, మానస, గాబ్రియల్ తదితరులు నటిస్తున్నారు. ఫోటో గ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్ : చిన్నా, సంగీతం : రఘు కుంచె, పాటలు : భాస్కరభట్ల, ఎడిటింగ్ : ఎస్.ఆర్. శేఖర్, ఫైట్స్ : విజయ్, డాన్స్ : ప్రదీప్ ఆంథోని, దినేష్, స్టిల్స్ : సాయి మాగంటి, కో-డైరెక్టర్ : విజయరామ్ ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్ : మోహన్ రాజు ఆర్, క్యాషియర్ : జంగపల్లి మొగలి, సమర్పణ : రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, కో-ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్, నిర్మాత : బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











