దూం దాంగా చైతు-కాజల్ ల ‘దడ’ ఆడియో వేడక

By Sindhu

అక్కినేని నాగచైతన్య, కాజల్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూయాన్ డైరెక్షన్లో కామాక్షి ఎంటర్ ప్రైజస్ అధినేత శివప్రసాద రెడ్డి నిర్మిస్తున్న 'దడ' సినిమా ఆడియో వేడుక నిన్న సాయంకాలం హైదరాబాదులోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుక ప్రారంభమైంది. చిత్రంలోని పాటలను సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పాడి, అభిమానులను ఉత్సాహపరిచారు. నాగచైతన్య తాతలు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు చేతుల మీదుగా ఈ సినిమా పాటల సీడీలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ, తమకు కాస్త పేరు రావడానికి పది పదిహేను సినిమాల సమయం పట్టిందనీ, నాగచైతన్యకు రెండు సినిమాలతోనే ఆ పేరు వచ్చిందనీ అన్నారు. తన దృష్టిలో అభిమానులే దేవుళ్ళనీ, తమ కుటుంబాన్ని ఇన్నాళ్లుగా ఆదరిస్తున్న అభిమానులకు రుణపడి ఉన్నామనీ ఆయన అన్నారు. ఏ హీరోకైనా హ్యాట్రిక్ సక్సెస్ రావడం అరుదనీ, అది చైతన్యకు ఈ సినిమా ద్వారా నిజమవుతోందని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. హీరో రాణా చెబుతూ, చైతూ తానూ చిన్నప్పటి నుంచీ కలసి మెలసి పెరిగామనీ, చైతూ తనకు ప్రాణమనీ అన్నాడు. ఈ సినిమాతో తను పెద్ద హీరోలలో ఒకడిగా ఎదగాలని కోరుకుంటున్నానన్నాడు. ఈ వేడుకలో ఇంకా పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X