నాగచైతన్య -కాజల్ ‘దడ’ సెన్సార్ పూర్తి ..!
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తొలిసారిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రని పోషించిన చిత్రం దడ. నాగచైతన్య, కాజల్ హీరో హీరోయిన్లుగా అజయ్ భూయాన్ డైరెక్షన్లో కామాక్షి ఎంటర్ ప్రైజస్ నిర్మించిన 'దడ' షూటింగ్, ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి కార్యక్రమాలని పూర్తి చేస్తుకున్న దడ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ 'దడ' సినిమా ఈ నెల 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో 600 ప్రింట్స్ తో భారీగా విడుదలకానుంది.
ఈ సినిమా షూటింగును కథా రీత్యా ఎక్కువ భాగం అమెరికాలో చేశారు. అలాగే, పాటలను అమెరికాతో బాటు యూరప్ దేశాలలో కూడా షూట్ చేశారు. 'ఏ మాయ చేసావే', '100% లవ్' చిత్రాలతో వరుస విజయాలలో వున్న నాగచైతన్య, ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. తనకిది మాస్ ఇమేజ్ ని తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన దడ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పాటలు హిట్ అయినట్టే చిత్రం కూడా ఘన విజయం సాధిస్తుందని అక్కినేని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











