'శివ' షేడ్స్ తో నాగచైతన్య చిత్రం

By Srikanya

నా కెరీయర్‌లో శివ ఎలాగో నాగచైతన్యకు దడ అలాంటిది. యూత్‌ అంతా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం సక్సెస్‌ అవుతుందని నాగార్జున అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో కొన్ని సీన్స్ శివని పోలి ఉండేలా చిత్రీకరించారని తెలుస్తోంది. ఆ విషయాన్ని నిర్మాత శివప్రసాద్ రెడ్డి చెప్తూ...కొన్ని సీన్స్ లో శివ టైమ్ లో నాగార్జునని గుర్తు చేస్తారని అన్నారు. ఇక నాగార్జున గీతాంజలితో ఏమి మాయ చేసావే చిత్రం పోలిక వచ్చినట్లుగా ఈ చిత్రం కూడా విజయవంతం అయ్యి శివని గుర్తు తెస్తుందని భావిస్తున్నారు.

నాగచైతన్య హీరోగా, అజయ్ ‌భుయాన్ దర్శకత్వంలో డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'దడ". దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం పాటలను సోమవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగచైతన్య ఈ చిత్రం విజయంపై మంచి నమ్మకంగా ఉన్నారు. ఇక నిర్మాత..ఈ ఏడాది 100% లవ్, దడ చిత్రాలతో పాత చరిత్రను చైతూ పునరావృతం చేయబోతున్నాడు. చైతన్యలోని మరోకోణాన్ని ఇందులో చూస్తారు. ఆగస్ట్ 12న 'దడ"ను విడుదల చేస్తాం అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X