విడుదలకు ముందే దడ పుట్టిస్తున్న రీమేక్ రైట్స్..!?
తెలుగు సినిమాకు ఈమధ్య కాలంలో రీమేక్ పరపతి పెరగడంతో నిర్మాతలకు అదనపు ఆదాయం కూడా బాగానే వస్తోంది. సినిమా హిట్ అయితే కనుక హిందీ రీమేక్ రైట్స్ రూపంలో లక్షలాది రూపాయలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఇంకా ఓ తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే, బాక్సాఫీసు వద్ద దాని రిజల్ట్ తెలియకుండానే, దాని హిందీ రీమేక్ రైట్స్ హాట్ కేక్ లా సేల్ అయిపోయాయి. నాగచైతన్య, కాజల్ హీరో హీరోయిన్లుగా నటించిన 'దడ' సినిమా ఈ క్రెడిట్ పొందింది. ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ తాజాగా సుమారు 80 లక్షలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దీంతో ఇప్పుడీ సినిమాకు మరింత క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. ఆగష్ట్ 11 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ 12 కోట్లకు ఏపీ పంపిణీ హక్కుల్ని తీసుకుంది.
దక్షిణాది మాస్ మసాలా చిత్రానికి బాలీవుడ్ లో గిరాకీ ఏర్పడడంతో ఇక్కడ రూపొందుతోన్న అలాంటి సినిమాలన్నిటి రీమేక్ రైట్స్ తీసేసుకోవడానికి బాలీవుడ్ నిర్మాతలు ఎగబడుతున్నారు. వచ్చే వారం విడుదల కానున్న నాగచైతన్య సినిమా 'దడ" మాస్ సినిమానే కావడంతో దీనిపై ఇప్పటికే పలువురి దృష్టి పడింది. దడపై పాజిటివ్ బజ్ ఉండడంతో దీనికి ఫ్యాన్సీ ఆఫర్ ఇవ్వడానికి పలువురు పోటీ పడగా, డీల్ 83లక్షలకి సెట్టయింది. ఇంకా సినిమా విడుదల కాకుండానే బాలీవుడ్ వాళ్లు ఈ సినిమాని కొనేసారంటే ఖచ్చితంగా ఇందులో ఏదో విషయం ఉన్నట్టే అనుకోవాలి. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ దడ చిత్రం ఏపీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 12కోట్లకి హోల్ సేల్ గా తీసేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండు హిట్స్ ఇచ్చి ఊపుమీదున్న చైతన్యఈ చిత్రంతో మాస్ జనాన్ని కూడా తన ఫాలోవర్స్ గా మార్చుకోగలడని అంచనాలున్నాయి. అయితే మాస్ హీరోగా నిలబడే సత్తా అతనిలో ఎంతుందనేది త్వరలో తేలిపోతుంది.


Click it and Unblock the Notifications











