నాగచైతన్య 'దడ' చిత్రం విడుదల వాయిదా

By Srikanya

నాగచైతన్య తాజా చిత్రం దడ ఫస్ట్ లుక్ ట్రైలర్స్ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఆ చిత్రాన్ని ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు దాన్ని ఆగస్టు 25వ తేదీకి వాయిదా వేసారు. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ద్వారా అజయ్ భుయాన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలోనూ, బ్యాంకాక్ లోనూ జరిగింది. లవ్ తో కలిసిన యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిస్తున్నారు. ఇక మరో ప్రక్క నాగచైతన్య బెజవాడ రౌడీలు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X