»   »  వీడియో లీక్: శ్రీదేవి మరణానికి ముందు జాహ్నవి సెట్స్‌లో ఇలా... ఇపుడు ఆసంతోషం మాయం!

వీడియో లీక్: శ్రీదేవి మరణానికి ముందు జాహ్నవి సెట్స్‌లో ఇలా... ఇపుడు ఆసంతోషం మాయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
వీడియో లీక్: శ్రీదేవి మరణానికి ముందు జాహ్నవి సెట్స్‌లో ఇలా... ఇపుడు ఆ సంతోషం మాయం!

శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ 'ధడక్' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయంకాబోతున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరాఠీ హిట్ మూవీ 'సైరాట్' చిత్రీనికి రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. కాగా 'ధడక్' సెట్స్ నుండి కొన్ని ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

సెట్స్‌లో సరదాగా, సంతోషంగా జాహ్నవి

షూటింగ్ గ్యాపులో జాహ్నవి కపూర్ తన కోస్టార్ ఇషాన్ ఖట్టర్, ఇతర టీంతో సరదాగా గడుపుతూ లీకైన వీడియోలో కనిపించారు. జాహ్నవి ఈ చిత్రంలో ఎంత అందంగా కనిపించబోతోందో ఈ వీడియో చూసి అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఇందులో జాహ్నవి లైట్ ఎల్లో కలర్ డ్రెస్ ధరించి ఎంతో అందంగా, సంతోషంగా సరదాగా కనిపించింది.

 సంతోషం మాయం

సంతోషం మాయం

తన తల్లి శ్రీదేవి మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన జాహ్నవి గత వారమే తిరిగి సెట్స్‌కు హాజరైంది. అయితే గతంలో మాదిరిగా జాహ్నవి సెట్స్‌లో సంతోషంగా కనిపించడం లేదు అని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. శ్రీదేవి మరణానికి ముందు ఆమె ఎంతో సరదాగా సెట్స్‌లో కనిపించేవారని, ఇపుడు ఆమె మొహంలో సంతోషం మాయమైందని అంటున్నారు.

 నెక్స్ కోల్‌కతాకు

నెక్స్ కోల్‌కతాకు

ముంబైలో షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర యూనిట్ కోల్ కతా వెళ్లబోతున్నారు. అక్కడ సినిమాకు సంబంధించిన సెకండాఫ్ చిత్రీకరించబోతున్నారు. ముంబై, కోల్‌కతా రెండు సిటీల నేపథ్యంలో ‘ధడక్' సినిమా సాగబోతోంది.

 సినిమాపై భారీ అంచనాలు

సినిమాపై భారీ అంచనాలు

కులాంత ప్రేమ వివాహం, పరువు హత్యల నేపథ్యంలో ‘ధడక్' సినిమా కథ సాగుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. జీ స్టూడియోస్‌తో కలిసి ప్రముఖ ఫిల్మ్ మేకర్ రణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 తల్లిలాగే కష్టపడుతున్న జాహ్నవి

తల్లిలాగే కష్టపడుతున్న జాహ్నవి

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శశాంక్ ఖైతాన్ మాట్లాడుతూ... జాహ్నవి, ఇషాన్ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఎంతో డెడికేటెడ్‌గా నటిస్తున్నారు. జాహ్నవి తన తల్లి శ్రీదేవి తరహాలోనే చాలా హార్డ్ వర్క్ చేస్తోందని అని తెలిపారు. కాగా... ధడక్ చిత్రం జులై 6వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

English summary
Behind-the-scenes pictures and videos of Janhvi Kapoor and Ishaan Khatter shooting for Dhadak have been leaked on the internet. While Janhvi is seen wearing a yellow salwar kameez, Ishaan is clad in a yellow shirt, blue jacket and brown trousers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu