వయాగ్రాకు వాయిల్ చీర కట్టినట్లు...ఎవరీ లప లప, హెబ్బా పటేల్ సపోర్ట్
హైదరాబాద్: వయగ్రాకు వాయిల్ చీరకట్టినట్లు ఉంది..ఎవరీ లప లప అంటున్నాడు ధన్ రాజు. ఎప్పుడూ అంటారా..క్రింద పోస్టర్ చూడండి మీకే అర్దం అర్దమవుతుంది. పబ్లిసిటి కోసం ఎంతదైనా దిగజారి, ఎలాంటి పదాలనైనా వాడే స్దితికి చేరుకున్నారనటానికి ఈ చిన్న ఉదాహరణ చాలు.
'జబర్దస్త్' కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్న హాస్యనటుడు ధన్‌రాజ్. ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న హాస్యచిత్రం 'పనిలేని పులిరాజు'. చాచా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ విషయాన్ని ధన్‌రాజ్ సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నాడు. పాలేపు మీడియా ప్రై.లి. పతాకంపై చాచా దర్శకత్వంలో పి.వి.నాగేష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వి.వి. సంగీతం అందించిన ఈ సినిమా పాటలు నేరుగా మార్కెట్లోకి విడుదలయ్యాయి.
నిర్మాత పి.వి. నాగేష్ కుమార్ మాట్లాడుతూ మా "పనిలేని పులిరాజు" చిత్రం సెన్సార్ పూర్తయ్యింది. శనివారం సినిమా పాటలను మార్కెట్లోకి డైరెక్ట్ విడుదల చేశాం. తప్పకుండా పాటలు అందరికీ నచ్చుతాయి పాటలు సినిమాలో హైలైట్ గా వుంటాయి అని అన్నారు. ఈ సినిమా గురించి హెబ్బా పటేల్ ఏమంటోందో చూడండి.
సహ నిర్మాత రవి.కె. పున్నం మాట్లాడుతూ... ప్రస్తుతం మోషన్ పోస్టర్ విత్ డైలాగ్స్‌కు మంచి ఆదరణ వచ్చింది. రఘుబాబు కామెడీ, నటన సినిమాలో కడుపుబ్బా నవ్విస్తాయి. సినిమాను త్వరలో విడుదల చేస్తాం అని అన్నారు. దర్శకుడు చాచా మాట్లాడుతూ ధనరాజ్ నటన సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. వివి మంచి సంగీతాన్ని ఇచ్చారు. సినిమాలో హాస్యమే ప్రధానంగా వుంటుందని అన్నారు.
ప్రాచిసిన్హా, శ్వేతావర్మ, ఇషా, హరిణి, రఘుబాబు, కొండవలస, కోటేశ్వర రావు, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ మరుకుర్తి, సంగీతం: వి.వి. సహ నిర్మాత: రవి.కె.పున్నం, సమర్పణ: పి.లక్షి, నిర్మాత: పి.వి.నాగేష్ కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చాచా.


Click it and Unblock the Notifications











