సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ ‘ధనా ధన్’
హైదరాబాద్: థర్డ్ ఐ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోస్ వారి బ్లాక్ బస్టర్ మూవీ మేకర్స్ పతాకంపై వైభవ్, రమ్యా నంబీసన్ హీరో హీరోయిన్లుగా, తమిళ సంచలన దర్శకుడు శంకర్ దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేసిన శ్రీ దర్శకత్వంలో, యువ నిర్మాతలు శివ వై ప్రసాద్, శ్రీనివాస్ అనంతనేనిలు సంయుక్తంగా నిర్మిస్తోన్న సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ ‘ధనాధన్'. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ...‘సంచలన దర్శకుడు ‘రోబో' శంకర్ దగ్గర అసోసియేట్‌గా వర్క్ చేసిన శ్రీ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుంది. మొత్తం ఈ చిత్రంలో 5 పాటలుంటాయన్నారు.

గీతామాధురి, మాళవిక వంటి టాప్ సింగర్స్ పాడిన పాటలు ఈ చిత్రానికి మరో హైలెట్ కానున్నాయి. ఈ చిత్రం ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ వారు ముందే తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. బేసిగ్గా ఇదొక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్. వైభవ్ ఓ ఆర్డినరీ సాఫ్ట్ వేర్ కుర్రాడిగా ఇందులో మంచి అభినయం ప్రదర్శించాడు. రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉండే మంచి కథతో తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డిశంబర్ ద్వితీయార్థంలో ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము' అన్నారు.
వైభవ్, రమ్యానంబీసన్, కోటా శ్రీనివాసరావు, షాయాజీ షిండే, చార్లీ, ప్రవీణ్ మొదలగు వారు నటించిన ఈ చిత్రానికి పాటలు: రాణీ పులోమజాదేవి, మాటలు: శివపార్వతి, ప్లేబాక్ సింగర్స్: మాళవిక, అర్జున్, ప్రద్యోతన్, యామిక, గీతా మాధురి, కొరియోగ్రఫీ: అన్విత, శోభి, సినిమాటోగ్రఫీ: ఎ.ఎం.ఎడ్విన్ సాకే, సంగీతం: థమన్, నిర్మాతలు: శివ వై ప్రసాద్, శ్రనివాస్ అనంతనేని, కథ-దర్శకత్వం: శ్రీ.


Click it and Unblock the Notifications