అనుష్క సీక్రెట్ బయటపెట్టిన ధన్‌రాజ్.. 'భాగమతి'లో చేశాక తెలిసిందట..
Recommended Video

అనుష్క ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో అరుంధతిలో జేజమ్మ పాత్ర ఆమెకు చాలా స్పెషల్ అనే చెప్పాలి. అప్పటిదాకా కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమవుతూ వచ్చిన ఆమె.. ఆ సినిమాతో తనలోని మరో యాంగిల్ చూపించారు. అలాంటి పాత్రకు దగ్గరగా ఉన్న 'భాగమతి'తో మరోసారి ఆమె ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన కమెడియన్ ధన్ రాజ్.. అనుష్క గురంచి తాజాగా ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఇంతకీ ఏంటది?

అనుష్కకు ఎందుకా నిక్ నేమ్?:
ప్రభాస్‌ను అంతా డార్లింగ్ అని పిలిచినట్లే.. అనుష్కను 'స్వీటి' అని పిలుస్తారన్న సంగతి తెలిసిందే. అది ఆమె ముద్దుపేరు. 'భాగమతి'లో అనుష్కతో పాటు నటించిన ధన్ రాజ్.. అనుష్కను స్వీటి అని ఎందుకు పిలుస్తారో తెలిసిపోయిందంటూ ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

'స్వీటి' అని ఎందుకు పిలుస్తారంటే..:
'అనుష్కను దగ్గరగా చూడటం ఈ సినిమాలోనే ఫస్ట్ టైమ్. ఆమెను స్వీటి అని ఎందుకు పిలుస్తారో.. ఆమెతో పాటు చేశాక అర్థమైంది. అనుష్కకు చిన్న ఆర్టిస్ట్.. పెద్ద ఆర్టిస్ట్.. సీనియర్, జూనియర్ అనే తేడా ఏమి ఉండదు. ఆమెతో ఉంటే సెట్ అంతా కళకళలాడుతుంది. అందుకేనేమో ఆమె స్వీటి అంటారు' అని చెప్పుకొచ్చాడు ధన్ రాజ్.

అనుష్కతో చేయడం హ్యాపీ:
'భాగమతి'లో అనుష్కతో పాటు కలిసి నటించినందుకు హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెప్పాడు ధన్ రాజ్. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వచ్చిందని, దర్శకుడు అశోక్ అద్భుతంగా తెరకెక్కించాడని చెప్పారు. బాక్స్ ఆఫీస్ వద్ద 'భాగమతి' కచ్చితంగా మంచి విజయం నమోదు చేస్తుందన్న ధీమాతో ఉన్నాడు ధన్ రాజ్.

ట్రైలర్‌కు మంచి స్పందన:
ఇప్పటికే విడుదలైన 'భాగమతి' ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ట్రైలర్‌లో అనుష్క చెప్పిన డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. 'ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. 'భాగమతి' అడ్డా.. లెక్క తేలాలి, ఒక్కడ్ని పోనివ్వనూ' అంటూ అనుష్క హైఓల్టేజీతో చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే పాపులర్ అయ్యాయి.

రెండు పాత్రల్లో:
'భాగమతి'లో అనుష్క పాత్ర రెండు భిన్న పార్శ్వాల్లో సాగుతుందని తెలుస్తోంది. ఒకవైపు గ్లామర్ పాత్రలోనూ.. మరోవైపు 'భాగమతి' గాను కనిపించబోతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు అనుష్కు చుట్టు తిరిగే లవ్ స్టోరీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.

రేపే విడుదల;
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ-ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 26వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో ఉన్ని ముకుందన్, జయరాం, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్ కు ఇప్పటికే 11మిలియన్ల పైచిలుకు వ్యూస్ రావడం విశేషం.


Click it and Unblock the Notifications











