ధనుష్ 'త్రీ'తెలుగు వెర్షన్ విడుదల ప్రకటన
ధనుష్, శ్రుతిహాసన్ కాంబినేషన్ లో రూపొందిన 'త్రీ'చిత్రం రైట్స్ ని నట్టికుమార్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్య ధనుష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. తెలుగు వెర్షన్ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నట్టికుమార్ మాట్లాడుతూ ''కొలవెరి... పాట ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా శ్రోతలకు చేరువైంది. ఇటీవల విడుదలైన పాటలకి మరింత స్పందన లభిస్తోంది. అనిరుధ్ చక్కటి స్వరాలు సమకూర్చారు. 'త్రీ' అంటే ఏమిటి? అని ప్రేక్షకులు ఆసక్తిగా అడుగుతున్నారు. మూడు ప్రధానమైన పాత్రల మధ్య సాగే ఒక చక్కటి కథాంశమిది. ధనుష్, శ్రుతి పాత్రలే కాకుండా... అలాంటి మరొక పాత్ర కూడా ఉంటుంది. అదేమిటన్నది తెరపైనే చూడాలి. 'త్రీ'లాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండడం ఆనందంగా ఉంది. ఐశ్వర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది''అన్నారు. కె.విమలాగీత, నట్టికుమార్ నిర్మాతలు. ఇక వైదిస్ కొలవెరి...అంటూ రజనీకాంత్ అల్లుడు ధనుష్ పాడిన పాట ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. భారత దేశం ఎల్లలు దాటి ఇతర దేశాల్లో కొలెవెరి ఫీవర్ పట్టుకుంది కాబట్టే ప్రపంచ ప్రసిద్ధ పాటగా యూట్యూబ్ గోల్డెన్ లిస్టులో స్థానం దక్కించుకుంది. ధనుష్-శృతి హాసన్ జంటగా రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో '3' చిత్రంలోనిది ఈ పాట త్వరలో తెలుగు తెరను అలరించనుంది.


Click it and Unblock the Notifications











