మళ్లీ పాడాడు...ఈ సారి అంత హిట్టవుద్దా
బెంగళూరు : హీరోలు పాడటం కొత్త కాకపోయినా ఈ మధ్యకాలంలో అదో ట్రెండ్ గా మారింది. ఆ మధ్యన 'కొలెవెరిడి..' పాటతో సంచలనం సృష్టించిన ధనుష్ చందనసీమలో ప్రవేశించారు. హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న వజ్రకాయ సినిమా కోసం ధనుష్ పాట పాడారు.

చెన్నైలో మంగళవారం రాత్రి ఈ పాటను రికార్డు చేశారు. గతంలో శివరాజ్‌కుమార్ నటించిన జోగి సినిమా తమిళం రీమేక్‌లో ధనుష్ నటించారు. ఆ పరిచయం తర్వాత స్నేహంగా మారింది. దాంతో ఇప్పుడు శివరాజకుమార్ ఫోన్ చేసి అడగగానే నో చెప్పకుండా ఎన్ని పనులున్నా వచ్చి పాడేసి వెళ్లిపోయారు.
ఇక గతంలో తన భార్య దర్శకత్వంలో వచ్చిన 3 చిత్రంలో ధనుష్ అలవోకగా పాడిన పాట కొలివెరడి ఎంతో పెద్ద హిట్టైంది. ఆ తర్వాత చాల గ్యాప్ తర్వాత ధనుష్ ఈ పాటను పాడారు. ఈ పాటతో తమిళంలోకి శివరాజకుమార్ వచ్చే అవకాసం ఉంది.


Click it and Unblock the Notifications











