టాప్ డైరెక్టర్, టాప్ హీరో విడాకులు.. రెండేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన స్టార్ కపుల్!
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, రిలేషన్ లు, డేటింగ్ లు.. అలాగే విడాకులు కూడా చాలా కామన్. నచ్చితే కలిసుండడం, అది బాగుందనిపిస్తే పెళ్లి చేసుకోవడం.. పెళ్లై పిల్లలు పుట్టాక నచ్చకపోయినా విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. తాము విడిపోతున్నట్లు రెండేళ్ల క్రితం ప్రకటించిన ఓ స్టార్ కపుల్.. ఇప్పుడు విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారు. వీరిద్దరూ కచ్చితంగా కలుస్తారని ఇంత కాలం ఎదురు చూసిన అభిమానులకు షాక్ ఇస్తూ.. ఐశ్వర్య రజినీ కాంత్, ధనుష్ లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సూపర్ స్టార్ రజినీ కాంత్ కూతురు అయిన ఐశ్వర్య రజినీ కాంత్.. హీరో ధనుష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దనుష్ హీరోగా చేసిన కాదల్ కొండేన్ సినిమా రిలీజ్ సమయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత ఐశ్వర్య.. ధనుష్ ను మెచ్చి ఆయనకు ఓ లెటర్ తో పాటు బొకేను ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ వీళ్లు మాత్రం తాము స్నేహితులం మాత్రమే అని చెప్పుకొని తిరిగారు.

ఇలా చాలా కాలం పాటు మీడియా కంట పడుతూ.. వచ్చిన ఈ జంట ఇరుకుటుంబాలను ఒప్పించుకుని మరీ ఒక్కటయ్యారు. ముఖ్యంగా తనకంటే వయసులో ఐశ్వర్య రెండేళ్లు పెద్దది అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పెళ్లి చేసుకున్నాడు ధనుష్. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. యాత్ర, లింగలు కూడా ప్రస్తుతం టీనేజర్స్. అయితే 18 ఏళ్ల పాటు హాయిగా సాగిన వీరి సంసారంలో కలహాలు మొదలు అయ్యాయి. వాటిని తట్టుకోలేక ఇద్దరూ దూరం అవ్వాలనుకున్నారు. 2022లో ఈ విషషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ ప్రకటించారు.
గత రెండు సంవత్సరాలు వేరుగా ఉంటున్న వీళ్లు ఇప్పటి వరకు విడాకులు తీసుకోలేదు. కానీ ప్రస్తుతం విడాకుల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులోనే వీరు విడాకుల కోసం అప్లై చేసినట్లు ఇండియా టుడే ఎక్స్సూజివ్ కథనాన్ని వెల్లడించింది. ఇక జీవితంలో తాము కలిసుండలేమని.. ఇలా ఒంటరిగా ఉండడమే బాగుందని అటు ధనుష్ తో పాటు ఇటు ఐశ్వర్య కూడా ప్రకటించారు. ఇంతకాలం వీరిద్దరూ కలుస్తారనే ఆశ చాలా మంది అభిమానులకు ఉండగా.. ఇక వీరి విడిపోవడం ఖాయం అని తెలుస్తోంది. దీంతో వీరి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడానికి ప్రధాన కారణం ధనుష్ యే అని సమాచారం. ముఖ్యంగా ఆయన జీవితంలో ఉన్న వివాదాలే ముఖ్య కారణాలు అని వాటిని ఐశ్వర్య అస్సలే తట్టుకోలేకపోయిందని తెలుస్తోంది. అందుకే తాను ధనుష్ దూరం కావాలనుకుంది.. ఇలా ఇద్దరూ ఒకరికొకరు దూరం అయ్యారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి ముందు ముందు అయినా వీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారనే దానిపై పూర్తిగా క్లారిటీ ఇస్తారా లేదా అనేది.


Click it and Unblock the Notifications











