విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్​-ఐశ్వర్య.. నవ్వుతూ ఫొటో.. మళ్లీ కలిసిపోయారా?

కోలీవుడ్​ స్టార్​ కపుల్​గా 18 ఏళ్లు కలిసున్నారు ధనుష్​-ఐశ్వర్య రజనీకాంత్​. ఏమైందో తెలియదు కానీ, ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎప్పటికైనా వీళ్లిద్దరూ మళ్లీ కలవకపోతారా? అని ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్న సమయంలో సోషల్​ మీడియా అకౌంట్​లలో తన పేరు చివరన ఉన్న ధనుష్​ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్​గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక ఇప్పటివరకు ఎక్కడా ధనుష్​-ఐశ్వర్య కలిసిన సందర్భాలు లేవు. అయితే తాజాగా వీరిద్దరు కలిసి ఆశ్చర్యపరిచారు.

ధనుష్.. కోలీవుడ్​లో స్టార్​ హీరోలలో ఒకరు. ఐశ్వర్య రజనీకాంత్​.. సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ కుమార్తెగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ధనుష్​-ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉండేది.

పోస్ట్​తో షాక్​..

పోస్ట్​తో షాక్​..

18 ఏళ్లపాటు వివాహ బంధంతో కలిసి ఉన్న ధనుష్​-ఐశ్వర్య అనూహ్యంగా జనవరి 18, 2022న విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు షాక్​కు గురయ్యేలా చేశారు. 'భార్యాభర్తలుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని పోస్ట్​ పెట్టి ఆశ్చర్యపరిచారు.

ఒక్కటవుతారని..

ఒక్కటవుతారని..

ఈ వార్తతో సూపర్​ స్టార్​ రజనీ కాంత్, ధనుష్​ ఫ్యాన్స్​ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్​ తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్​ మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా? అని ఎంతో ఎదురుచూశారు.

ధనుష్​ పేరు తొలగించి..

ధనుష్​ పేరు తొలగించి..

కానీ, అలా జరగలేదు. ఇంకా తన సోషల్​ మీడియా అకౌంట్​లలో తన పేరు చివరన ఉన్న ధనుష్​ పేరు తొలగించి రజనీకాంత్​ పేరును చేర్చి ఐశ్వర్య ఇంకా షాక్​ ఇచ్చింది. విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి మళ్లీ వాళ్లిద్దరు కలిసిన దాఖలాలు లేవు.

హాజరవ్వని ఐశ్వర్య..

హాజరవ్వని ఐశ్వర్య..

ఒకసారి మాత్రం తన ఇద్దరు కుమారులను వెంట వేసుకుని ధనుష్ ఓసారి మ్యూజిక్​ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీత కచేరికి వెళ్లాడు. కానీ, అప్పుడు వారి వెంట ఐశ్వర్య రజనీకాంత్​ లేదు. అయితే తాజాగా, తొలిసారిగా విడిపోయిన తర్వాత ధనుష్​-ఐశ్వర్య కలిసి కనిపించారు.

ధనుష్​-ఐశ్వర్య కలిసి హాజరు..

ధనుష్​-ఐశ్వర్య కలిసి హాజరు..

ధనుష్​-ఐశ్వర్యల పెద్ద కుమారుడు యాత్ర స్కూల్​లో జరిగిన ఓ కార్యక్రమానికి ఈ మాజీ దంపతులు ఇద్దరు హాజరయ్యారు. 'ఈ రోజు చాలా బాగా ప్రారంభమైంది. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్​ కెప్టెన్​గా సెలెక్ట్​ అయ్యాడు' అని సోమవారం అంటే ఆగస్టు 22న తన సోషల్​ మీడియా అకౌంట్​లో ఒక పోస్ట్ పెట్టింది ఐశ్వర్య.

 నవ్వుతూ ధనుష్-ఐశ్వర్య..

నవ్వుతూ ధనుష్-ఐశ్వర్య..


ఈ పోస్ట్​లో ఫ్యామిలీ పిక్​ను కూడా తన ఇన్​స్టాగ్రామ్​ స్టోరీలో పెట్టింది. ఈ ఫొటోలో తమ పిల్లలతో ధనుష్, ఐశ్వర్య కలిసి కెమెరా వైపు చిరు నవ్వు చిందిస్తూ కనిపించడం ఆకట్టుకునేలా ఉంది. అతి కొద్ది సమయంలోనే ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్​ అయ్యాయి.

 మళ్లీ కలిసిపోయారా?..

మళ్లీ కలిసిపోయారా?..


ఈ పిక్​ చూసిన అభిమానులు ఉబ్బితబ్బిబ్బయిపోయి మళ్లీ వీళ్లిద్దరూ కలిసిపోయారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నాడు ధనుష్​. ఇటీవలే తిరు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మరోపక్క బాలీవుడ్​లో అడుగుపెట్టనుంది ఐశ్వర్య రజనీకాంత్. ఓ సాథీ చల్​ అనే లవ్​ స్టోరీని డైరెక్ట్ చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X