Captain Miller Trailer: అంచనాలు పెంచేస్తున్న కెప్టెన్ మిల్లర్ ట్రైలర్.. అదిరే యాక్షన్ సీన్లున్నా అదే మైనస్సా!
ధనుష్.. ఈయన తమిళ హీరోనే అయినప్పటికీ తెలుగులోనూ అనేక మంది అభిమానులు ఉన్నారు. ఈయన చేసే చాలా సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతుంటాయి. ఈయనను అభిమానిస్తూ.. ఆయన చేసే అన్ని చిత్రాలను చూసే వాళ్లు తెలుగులోనూ ఎక్కువగా ఉండడంతో ద్విభాషా చిత్రాలతో వస్తుంటారు. అయితే తాజాగా ఈయన కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
కానీ తెలుగులో మాత్రం ఈ సినిమాను ఇప్పుడే విడుదల చేయరట. ఎక్కువ పోటీ ఉండడం, థియేటర్లు దొరక్కపోవడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే తెలుగు భాషలో తప్ప మిగతా అన్ని భాషల్లో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు. తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల అయింది. ఇప్పుడిప్పుడే విడుదల అయిన కెప్టెన్ మిల్లర్ ట్రైలర్ నిజంగా అదిరిపోయింది. ధనుష్ లుక్ అయితే మరింత పవర్ ఫుల్ గా ఉంది. ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్లతో రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్ ను చూస్తే ఎవరికైనా సరే గూస్ బంప్స్ రావడం ఖాయం.

ఆర్మీలో కెప్టెన్ గా ఉన్న ధనుష్ ఆ తర్వాత ఎందుకు రాక్షసుడిగా మారతాడు, ఆ తర్వాత ఏం చేశాడనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ స్టోరీలో ధనుష్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. ఆర్మీలో ఉన్నప్పుడు చాలా సన్నగా ఫిట్ గా కనిపించిన అతడు ఆ తర్వాత కాస్త లావుగా మారి మరింత గంభీరంగా కనిపిస్తూ దర్శనం ఇచ్చాడు. గన్ పట్టుకుని శత్రువులను కాలుస్తూ చాలా పవర్ ఫుల్ పాత్రలో దర్శనం ఇచ్చాడు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మాత్రం విడుదల చేయలేదు.
అత్యద్భుతంగా ఉన్న ఈ ట్రైలర్ ను తెలుగులో కూడా విడుదల చేస్తే బాగుండేది. తెలుగులో రాకపోవడమే ఈ చిత్రానికి మైనస్ గా మారుతుందేమో అనిపిస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నా ఇతర భాషల్లో విడుదల అవుతుండడంతో తెలుగు సినిమా కాపీ కూడా లీక్ అవుతుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు. మిగతా భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప తెలుగులోనూ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సందడి చేయలేదు. మరి ఈ సినిమా తెలుగులో ఎప్పుడు విడుదల అవుతుంది, ఏంటనేది తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

కెప్టెన్ మిల్లర్ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తుండగా.. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. అలాగే కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్, జాన్ కొక్కెన్ మరియు ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే మాత్రం అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ అద్భుతమైన చిత్రం ఏ రేంజ్ లో హిట్టు కొడుతుంది, ఏ రేంజ్ లో వసూళ్లు రాబట్టుకోనుందో చూడాలి.


Click it and Unblock the Notifications











