twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధనుష్ హాలీవుడ్ టీజర్ : ధనుష్ నటన ఎక్స్టార్డినరీ..హాలీవుడ్ భామలతో రొమాన్స్..!

    |

    Recommended Video

    The Extraordinary Journey of the Fakir tease

    నటనలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ధనుష్. సూపర్ స్టార్ రజిని అల్లుడైనప్పటికీ సొంతంగా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నాడు. రఘువరన్ బిటెక్, 3 వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ హాలీవుడ్ లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్టార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ '. తాజాగా ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు. దర్శకుడు కెన్ స్కాట్ ఈ చిత్ర అనుభవాలని వెల్లడిస్తుండగా టీజర్ రన్ అవుతుంది. టీజర్ లో ధనుష్ నటన అద్భుతంగా ఉంది.

    ప్రయోగాలపై ఆసక్తి

    ప్రయోగాలపై ఆసక్తి

    బక్క పలచటి దేహంతో కనిపించే ధనుష్ నటనలో మహా దిట్ట. కొత్త ప్రయోగాలు చేయడంలో ముందుంటాడు. అందుకే ధనుష్ రజిని అల్లుడైనప్పటికీ సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతంలో ధనుష్ నటించిన కొన్ని సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించకపోయినా నటన పరంగా ధనుష్ కు మంచి మార్కులు పడేలా చేసాయి.

     అమితాబ్ కు గట్టి పోటీ

    అమితాబ్ కు గట్టి పోటీ

    ధనుష్ బాలీవుడ్ లో సైతం నటించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో ధనుష్ కలసి నటించిన చిత్రం షమితాబ్. ఈ చిత్రంలో నటన పరంగా ధనుష్ అమితాబ్ కు గట్టి పోటీనిచ్చాడనే ప్రశంసలు దక్కాయి.

     కన్న తల్లిని విడిచి ఉండలేక

    కన్న తల్లిని విడిచి ఉండలేక

    ధనుష్ ఈ హాలీవుడ్ చిత్రంలో లావాష్ పటేల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కన్న తల్లిని విడిచి ఉండలేని కుర్రాడిగా, లోకజ్ఞానం తెలియని కుర్రాడిగా ధనుష్ కనిపించబోతున్నాడు.

    విధిలేని పరిస్థితుల్లో

    విధిలేని పరిస్థితుల్లో

    విధిలేని పరిస్థితుల్లో ధనుష్ ప్రపంచ యాత్ర చేయవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ధనుష్ కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, అతడు ఎలాంటి సాహసాలు చేయవలసి వచ్చింది అనేదే ఈ చిత్ర కథ.

    ధనుష్ నటన అదుర్స్

    టీజర్ లో ధనుష్ నటన అద్భుతంగా ఉంది. కొంచెం అమాయకత్వం, కొంచెం అల్లరితనం కలగలసిన కుర్రాడిగా ధనుష్ కనిపించబోతున్నాడు. ఇండియా, ఇటలీ, లిబియా, ఫ్రాన్స్ వంటి దేశాలలో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంది. వివిధ దేశాలకు చెందిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు.

     హాలీవుడ్ హీరోయిన్స్ తో రొమాన్స్

    హాలీవుడ్ హీరోయిన్స్ తో రొమాన్స్

    ధనుష్ రొమాన్స్ లో కూడా మంచి దిట్ట. 3, రఘువరన్ బిటెక్ వంటి చిత్రాలలో ధనుష్ రొమాన్స్ సన్నివేశాలలో ఎలా నటించాడో తెలిసిందే. ఇక హాలీవుడ్ తారలతో అంటే రొమాన్స్ ఘాటు ఇంకాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. హాలీవుడ్ భామలు బెనారైస్ బెజో,దడారియో లో ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు.

     విడుదల ఎప్పుడంటే

    విడుదల ఎప్పుడంటే

    ఈ చిత్రం మే 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంగ్లీషుతో పాటు ప్రెంచ్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ధనుష్ నటిస్తున్న తొలి హాలీవుడ్ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

    English summary
    Dhanush first hollywood movie The Extraordinary Journey of the Fakir teaser released. Dhanush actiong is superb in this teaser. The movie will going to hit the screens on 30 Ma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X